Site icon NTV Telugu

Supreme Court: పెళ్లైన ఏడాదికే విడాకులు కోరిన భార్య.. రూ.5 కోట్ల భరణం డిమాండ్.. మహిళపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme Court

Supreme Court

ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న సంఘటనలు పెళ్లి అంటేనే భయం పుట్టేలా చేస్తున్నాయి. పెళ్లికి ముందే రిలేషన్ షిప్ లో ఉండి పెళ్లాయ్యాక కూడా కొనసాగించి కొంతమంది భార్యలు భర్తలను అంతమొందిస్తున్నారు. మరికొంత మంది విడాకుల పేరుతో కోట్ల రూపాయల భరణం కోరి భర్తలకు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా ఇలాగే ఓ మహిళ పెళ్లైన ఏడాదికే భర్త నుంచి విడాకులు కోరింది. అంతేకాదు రూ. 5 కోట్ల భరణం డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంలో వివాహాన్ని రద్దు చేసుకోవడానికి రూ.5 కోట్ల భరణం కోరిన మహిళపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Also Read:Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ ‘‘దేశద్రోహి’’.. గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా సంచలన వ్యాఖ్యలు..

రూ.5 కోట్లు అడగడం దారుణమని, ఆమెకు మేము ఇచ్చే తీర్పు కఠినంగా ఉంటుందని అసహనం వ్యక్తం చేసింది జస్టిస్ జె.బి పార్దివాలా ధర్మాసనం. విచారణ సమయంలో భర్త తరపు లాయర్ తిరిగి కలవడానికి భార్య తరపు వారితో చర్చలు చేశామని.. వారు రూ.5 కోట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారని కోర్టుకు విన్నవించాడు. భర్త అమెజాన్‌లో ఇంజనీర్ సెటిల్‌మెంట్ కోసం రూ. 35 లక్షలు ఆఫర్ చేశాడు, కానీ అతని భార్య రూ. 5 కోట్లు కావాలని కోరుకుందని ఆరోపించారు.

Also Read:Turbo EV 1000: ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ మినీ ట్రక్కు.. టర్బో EV 1000 విడుదల.. రూ. 5.99 లక్షలకే

జస్టిస్ పార్దివాలా, భర్త తరపు న్యాయవాదిని ఉద్దేశించి మాట్లాడుతూ, “ఆమెను తిరిగి పిలవడం ద్వారా మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. మీరు ఆమెను భరించలేరు. ఆమె కలలు చాలా పెద్దవి” అని తెలిపారు. 5 కోట్ల డిమాండ్ అసమంజసమని కోర్టు అభివర్ణించింది. కోర్టు వివాహ రద్దు కేసును విచారిస్తున్నప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. చివరికి విడిపోయిన జంటను తదుపరి పరిష్కార చర్చల కోసం సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కేంద్రానికి తిరిగి రావాలని ధర్మాసనం ఆదేశించింది. రూ. 5 కోట్ల జీవనభృతి డిమాండ్‌ను కొనసాగించవద్దని భార్యను హెచ్చరించింది. సుప్రీంకోర్టు మ్యుటేషన్ సెంటర్లో మరోసారి చర్చించుకోవాలని ఇరు పార్టీలను ఆదేశించింది. అక్టోబర్ 5న సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కేంద్రం ముందు ఇరు పక్షాలు హాజరు కావాలని సుప్రీంకోర్టు కోరింది.

Exit mobile version