పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఓ వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని ఒక వివాహిత కేసును సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. నిందితుడి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని ఆ మహిళ కోర్టును కోరింది. అయితే, ఈ కేసులో కోర్టు ఆశ్చర్యకరమైన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో తీర్పు చెబుతూ సుప్రీంకోర్టు ఆ మహిళను హెచ్చరించింది. తన వివాహ జీవితంలో భర్త కాకుండా వేరే వ్యక్తితో శారీరక సంబంధం కలిగి ఉంటే ఆమెపై కేసు నమోదు చేయవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
READ MORE: Uttar Pradesh: ఆ ఎమ్మెల్యేలకి ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్లతో క్లాసులు.. ఏం నేర్చుకోబోతున్నారంటే..?
వివాహిత తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ఆ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని తప్పుడు వాగ్దానాలు చేసి ఆ మహిళతో లైంగిక సంబంధం కొనసాగించాడని పేర్కొన్నారు. ఈ అంశంపై న్యాయమూర్తులు ఎం ఎం సుందరేష్, ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం స్పందించింది.. “మీకు పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మీరు పరిణతి చెందిన మహిళ. వివాహం జరిగినప్పటికీ.. భర్తతో కాకుండా మరో వ్యక్తితో మీరు ఓ బంధాన్ని ఏర్పార్చుకున్నారు. ఇది మీకు తెలిసే జరిగింది” అని తెలిపారు. వివాహం పేరుతో ఆ వ్యక్తి ఆ మహిళను శారీరక సంబంధం కోసం హోటళ్లకు, విశ్రాంతి గృహాలకు చాలాసార్లు పిలిచాడని న్యాయవాది చెప్పగా.. మీరు ఎందుకు పదే పదే హోటళ్లకు వెళ్లారు? అని ఆ మహిళను ధర్మాసనం ప్రశ్నించింది. వివాహితగా ఉంటూనే వేరొకరితో సంబంధం పెట్టుకోవడం నేరమని.. అది ఆమెకు కూడా తెలుసన్నారు.
READ MORE: Nidhhi Agerwal : వేరే వంద సినిమాలు చేసినా పవన్ తో ఒక్క సినిమా చేసినా ఒకటే!
ఆ పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు..
వాస్తవానికి.. 2016లో సోషల్ మీడియాలో ఈ వివాహిత, అంకిత్ బర్న్వాల్ మధ్య ప్రేమాయణం మొదలైంది. బర్న్వాల్ పట్టుదల, ఒత్తిడితో తన భర్త నుంచి విడాకులు కోరినట్లు ఆ మహిళ ఆరోపించింది. మార్చి 6న కోర్టు విడాకులు మంజూరు చేసింది. విడాకులు తీసుకున్న రెండు వారాలకే ఆ మహిళ బర్న్వాల్ ను పెళ్లి చేసుకోమని కోరింది. కానీ అతను నిరాకరించాడని ఆమె ఆరోపించింది. దీంతో ఆమె బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత బర్న్వాల్ ఎలాంటి లైంగిక కార్యకలాపాలకు పాల్పడలేదని రికార్డుల ద్వారా తేలడంతో పాట్నా హైకోర్టు నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆ వివాహిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.
