Site icon NTV Telugu

IPL2023 : సన్ రైజర్స్ లోకి ఇంపాక్ట్ ప్లేయర్ గా ధరణి.. ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చిన దసరా టీమ్..

Dasara Movie

Dasara Movie

ఐపీఎల్ 2023 సీజన్ లో మొదటి రెండు మ్యాచ్ ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చిత్తుగా ఓడింది. కోట్లు పెట్టి కొన్న హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్ కానీ.. భారీ ఆశలు పెట్టుకున్న అయిడిన్ మార్ర్కమ్ పెద్దగా మెప్పించలేకపోతున్నారు. ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, భువీ, అదిల్ రషీద్, ఫజల్ హక్ ఫరూకీ.. ఇలా వరల్డ్ క్లాస్ బౌలర్లతో ఐపీఎల్ లో భీకరమైన బౌలింగ్ లైనప్ ఉన్న టీమ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎస్ఆర్ హెచ్. అయితే పేపర్ మీద ఉన్న స్ట్రాంగ్ గా కనిపిస్తున్న జట్టు.. వికెట్లు తీయడంతో మాత్రం అట్టర్ ప్లాప్ అవుతుంది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 72 పరుగుల తేడాతో ఓడిన ఎస్ ఆర్ హెచ్.. ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

Also Read : Kunamneni: CPI, CPM కలిసి సమావేశం అవడం ఇది తొలిసారి

రెండు మ్యాచ్ ల్లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు స్కోర్ 140 మార్కును కూడా దాటలేకపోయింది. అయితే తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ లోకి ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చేందుకు ధరణి సిద్ధంగా ఉన్నాడంటూ దసర మూవీ టీమ్ ప్రకటించింది.
నేచురల్ స్టార్ నాని.. మహానటి కీర్తి సురేశ్ జంటగా కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొంది.. మార్చ్ 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన దసరా సినిమా.. బ్యాక్సాఫిస్ దగ్గర రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లో చేరిన దసరా రెండో వారంలోనూ బాక్సాఫిస్ దగ్గర జోరు తగ్గకుండా దూసుకుపోతుంది.

Also Read : SRH IPL2023 Third Match Live: మూడో మ్యాచ్ లోనైనా సన్ రైజర్స్ బోణీ కొడుతుందా?

అయితే ఈ వారం విడుదలైన సినిమాలకు డిజాస్టర్ టాక్ రావడం.. నాని దసరా సినిమాకి బాగా కలిసి వస్తోంది. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ లోకి ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చేందుకు ధరణి సిద్ధంగా ఉన్నాడంటూ మూవీ టీమ్ క్రికెట్ ర్యాంప్ ప్రోమోని రిలీజ్ చేసింది. ధరణికి ఫ్యాన్సీ కాంట్రాక్ట్ ఇచ్చేవాళ్లు ఎవరైనా ఉన్నారా.. సన్ రైజర్స్ హైదరాబాద్.. సరైన ఇంపాక్ట్ ప్లేయర్ కోసం చూస్తున్నారా మా ధరణి బాక్సాఫీస్ దగ్గర సెంచరీ కొట్టి ఫుల్లు ఫామ్ లో ఉన్నాడు అంటూ ఈ ప్రోమోకి క్యాప్షని ఎస్ఎల్ వీ సినమాస్ జోడించారు.

Also Read : Tammineni: ఈ గడ్డపై ఎగిరేది కాషాయ జెండా… గోల్కొండ కోట కింద బొంద పెడతాం

ఆఖరికి మూవీ కూడా ఈ విధంగా ట్రోల్ చేస్తోందని.. కనీసం ఇప్పుడైనా గెలవండి అంటూ ఈ పోస్టుకి ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో ఇవాళ పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ ఆడనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్.. వరుసగా రెండు మ్యాచ్ ల్లో గెలిచి జోరు మీదున్న పంజాబ్ కింగ్స్ ని హైదరాబాద్ ఓడించగలదా అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version