Site icon NTV Telugu

Sunflower Cultivation: పొద్దుతిరుగుడు సాగులో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Sunflower

Sunflower

మనదేశంలో పండిస్తున్న వాణిజ్య పంటల్లో పొద్దుతిరుగుడు కూడా ఒకటి.. ఎక్కువగా వంట నూనె కోసం ఎక్కువగా వాడుతుంటారు.. అతి తక్కువ కాలంలో పండించి అధిక లాభాలను పొందవచ్చు.. ఈ పంట సాగు విధానం, విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటే చాలు.. ఈ పంట గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వీటిని వానాకాలంలో తేలికపాటి నేలల్లో జూన్ రెండవ వారం నుండి జులై చివరి వరకు, బరువైన నేలల్లో ఆగస్టు మధ్య వరకు విత్తుకోవచ్చు. యాసంగిలో నవంబర్-డిసెంబర్ , జనవరి, ఫిబ్రవరి మొదటి పక్షం వరకు నీటి పారుదల క్రింద దీన్ని సాగు చెయ్యొచ్చు..

ఈ విత్తనాలను పొలంలో విత్తేముందు విత్తన శుద్ధి చెయ్యడం చాలా మంచిది.. ఎకరాకు 2.5- 3.0 కిలోల విత్తనం కావాలి. థయోమిథాక్సమ్ 3 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5.0 మి.లీ ఒక కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసుకోవడం వల్ల నెక్రోసిన్ వైరస్ తెగులు సవస్యను అధిగమించవచ్చు.. అలాగే విత్తనాలు గుచ్చేటప్పుడు దూరం కూడా చూసుకోవాలి..

ఎరువుల విషయానికొస్తే.. ఎకరాకు 2-3 టన్నుల పశువుల ఎరువు చల్లుకొవాలి. వర్షాధారపు పంటకు 24 కిలోల నత్రజని, 36 కిలోల భాస్వరం మరియు 12 కిలోల పొటాషియం నిచ్చే ఎరువులను వేయాలి. విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు పెండిమిథాలిన్ 5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చెయ్యాల్సి ఉంటుంది.. కలుపు నివారణ కూడా చూసుకోవాలి.. అలాగే పంట విత్తిన 25-30 రోజుల తరువాత గుంటక/దంతితో అంతరసేద్యం చేయాలి. పొద్దుతిరుగు సాగులో అధికంగా తెల్లదోమ, తామర పురుగులు, పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు, బూడిద తెగులు, అల్జర్నేరియా ఆకుమచ్చ తెగుళ్లు వచ్చే అవకాశం ఉంది.. జాగ్రత్త తీసుకోవడం మంచిది.. ఎకరాకు సుమారు 400 కిలోలు వర్షాధారం క్రింద, 400-600 కిలోల నిశ్చిత వర్షపాత పరిస్థితులలో, 800-900 కిలోలు దిగుబడిని పొందవచ్చు.. వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం వల్ల మంచి దిగుబడి పొందవచ్చు..

Exit mobile version