Site icon NTV Telugu

Sundar Pichai: ఎమోషనల్‌ పోస్ట్‌ చేసిన గూగుల్‌ సీఈఓ.. 20 ఏళ్ల బంధం అంటూ..

Sundar Pichai

Sundar Pichai

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్., గూగుల్‌ సంస్థలో చేరి 20 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా తన భావనలను ఓ పోస్ట్ రూపంలో షేర్ చేశారు. 2004లో సంస్థలో ప్రాడక్ట్ మేనేజర్‌గా చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న సందర్భంగా పోస్టు షేర్ చేశారు. తన ఉద్యోగంలో చేరిన తొలినాల్లో నుంచి ఇప్పటి వరకు సంస్థలో ఎన్నో మార్పులు జరిగిన విషయాలు గుర్తుతెచ్చుకొని పోస్టు చేశారు.

Also read: Ramayanam : ‘రామాయణం’ షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..

2004 ఏప్రిల్ 26 న నా పని గూగుల్‌ లో నా మొదటి రోజు ప్రారంభమైంది. ప్రాడక్ట్‌ మేనేజర్‌గా నా ప్రయాణాన్ని ప్రారంభించాను. అప్పటి నుండి ఈ సంస్థలో చాలా మార్పులు జరిగాయి. సాంకేతికత, మా ఉత్పత్తులను ఉపయోగించే వారు ప్రజల సంఖ్య రోజురోజుకి పెరిగింది. ఇలా ఎన్నో మార్పులు జరిగినవి. అలాగే నా జీవితంలోనే కూడా. కానీ, ఈ గొప్ప సంస్థలో పని చేస్తుంటే నాకు కలిగే ఉత్సాహం మాత్రం మారలేదు. 20 ఏళ్లు గడిచిపోయాయి. ఈ సందర్భంగా నా జీవితంలో మీరందరు భాగమైనందుకు ఇప్పటికీ నేను నాకు అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా సంస్థ నుండి తనకు అందిన తీపి గుర్తులను షేర్‌ చేసుకున్నారు. దాంతో ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌ గా మారింది.

Also read: Mumbai: ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్.. కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం

సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన సుందర్ పిచాయ్ 2004లో గూగుల్‌ లో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఒక సాధారణ ఉద్యోగిగా గూగుల్‌ లోకి అడుగుపెట్టిన అయన.. సంస్థ అభివృద్ధికి నిరంతరం కృషి చేశారు. ఆయన ఆలోచనల నుంచి పుట్టిన గొప్ప ఆవిష్కరణలను క్రోమ్‌, ఆండ్రాయిడ్‌, డ్రైవ్‌ మొదలైన గొప్ప ఆవిష్కరణలు ఆయన ఆలోచనల నుంచి పుట్టించారు. ఆ కష్టానికి ప్రతిఫలంగా 2015లో అయనకు సీఈవో పదవి దక్కింది.

Exit mobile version