NTV Telugu Site icon

Prasanna Vadanam :సస్పెన్స్ థ్రిల్లర్ గా సుహాస్ ‘ప్రసన్న వదనం’ ట్రైలర్..

Prasannavadaanaam

Prasannavadaanaam

హీరో సుహాస్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. కలర్ ఫోటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. ఆ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. రీసెంట్ గా అంబాజీపేట మ్యారేజి బ్యాండుతో మంచి విజయం సాధించిన సుహాస్ త్వరలో ‘ప్రసన్న వదనం’ అనే సినిమాతో రాబోతున్నాడు.. ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు..

ఇప్పటివరకు సినిమా నుంచి బయటకు అప్డేట్స్ అన్ని జనాలను బాగా ఆకట్టుకున్నాయి.. లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్ పై మణికంఠ, ప్రసాద్ రెడ్డి నిర్మాణంలో కొత్త దర్శకుడు అర్జున్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుంది.. ఈ సినిమాలో పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్లు గా నటిస్తున్నారు.. అలాగే వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేతా తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు..

ఈ సినిమా నుంచి మొన్నీమధ్య సాంగ్ రిలీజ్ అయ్యింది.. ఆ సాంగ్ జనాల నుంచి మంచి స్పందనను అందుకుంది.. ఫేస్ బ్లైండ్ నెస్ అనే జబ్బు కాన్సెప్ట్ తో సుహాస్ మరో కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్నాడు.. ఈ సినిమా లో సుహాస్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు.. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా పై ఆసక్తిని కలిగిస్తుంది.. ఈ సినిమాలో కూడా సుహాస్ నటన జనాలను ఆకట్టుకొనుంది.. సస్పెన్స్ థ్రిల్లర్ గా ట్రైలర్ ఉంటుందని వీడియోను చూస్తే తెలుస్తుంది.. ఇక ట్రైలర్ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.. ట్రైలర్ పై ఓ లుక్ వేసుకోండి..

Show comments