వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో యంగ్ హీరో సుహాస్ ఎప్పుడూ ముందుంటారు. ‘కలర్ ఫోటో’, ‘రైటర్ పద్మభూషణ్’, ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ సృష్టించుకున్న ఆయన, ఇప్పుడు ‘హే భగవాన్’ అంటూ పక్కా కామెడీతో మన ముందుకు వస్తున్నారు. గోపి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ, సినిమాపై ఆసక్తిని పెంచేసింది.
Also Read : Chiranjeevi: ‘యుఫోరియా’లో గౌతమ్ మీనన్ రోల్ చిరంజీవి చేయాల్సిందా?
ఫిబ్రవరి 20న గ్రాండ్ రిలీజ్ కి రెడి అయిన ఈ చింత్రం ప్రమోషన్స్ లో భాగంగా, తాజాగా విడుదలైన ‘హే భగవాన్’ ట్రైలర్ విడుదల చేశారు. ఆద్యంతం వినోదాత్మకంగా సాగిన ఈ ట్రైలర్ లో తన తండ్రి చేస్తున్న బిజినెస్ ఏంటో తెలుసుకున్న హీరో, దాన్ని ఎలాగైనా వృద్ధిలోకి తీసుకురావాలని పడే తపన, ఆ క్రమంలో ఎదురయ్యే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నాయి. అయితే, గతంలో విడుదలైన గ్లింప్స్ టీజర్‌లో మాదిరిగానే, ఈ ట్రైలర్‌లో కూడా ఆ “బిజినెస్” ఏంటనే విషయాన్ని చిత్రబృందం బయటపెట్టలేదు. ఆ సీక్రెట్‌ను సస్పెన్స్‌గా ఉంచుతూనే సుహాస్ తనదైన శైలిలో కామెడీ పండించారు. సుహాస్ నటన, డైలాగ్ టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మొత్తనికి సుహాస్ ఈ మూవీతో కూడా మంచి హిట్ అందుకునేలా ఉన్నారు.
