Site icon NTV Telugu

Stone Pelting Attack: ఏర్పేడులో ఆర్.కృష్ణయ్యపై రాయితో దాడి

Stone Pelting Attack

Stone Pelting Attack

Stone Pelting Attack on R.Krishnaiah: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులో ఎంపీ కృష్ణయ్య, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిసపై దాడి జరిగింది. ఏర్పేడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడికి చేశారు. ఎంపీ ఆర్.కృష్ణయ్య వాహనంపై నిల్చుని మాట్లాడుతుండగా.. వెనుక నుంచి రాయి వచ్చి వీపుభాగంలో తగిలింది. ఈ దాడిలో కృష్ణయ్య వీపుపై చిన్న గాయమైంది. రాయి దాడి తర్వాత కూడా కృష్ణయ్య ప్రసంగం కొనసాగించారు. సీఎం జగన్‌ బీసీలకు చేస్తున్న మేలును చూసి ఓర్వలేక తనపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి రాళ్ల దాడికి భయపడే ప్రసక్తే లేదన్నారు.

 

Exit mobile version