NTV Telugu Site icon

Stock Market Roundup 02-05-23: వరుసగా 8వ రోజూ.. అదే జోరు..

Stock Market Roundup 02 05 23

Stock Market Roundup 02 05 23

Stock Market Roundup 02-05-23: దేశీయ స్టాక్ మార్కెట్.. మే నెలను శుభారంభం చేసింది. వరుసగా ఎనిమిదో రోజు లాభాలతో ముగిసింది. అమెరికాలోని ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌ను నియంత్రణ సంస్థలు జప్తు చేయటం, డిపాజిట్లు, ఆస్తులు జేపీ మోర్గాన్ ఛేజ్ చేతికి చేరటం ఆసియా మార్కెట్లలో సెంటిమెంట్‌ని పెంచింది.

Minister Puvvada Ajaykumar: లకారంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. తారక్ తో మంత్రి అజయ్ భేటీ

దీంతో.. ఇవాళ మంగళవారం ఉదయం రెండు కీలక సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. రోజంతా పాజిటివ్ ట్రేడింగ్ కొనసాగింది. సెన్సెక్స్ 242 పాయింట్లు పెరిగి 61 వేల 354 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 82 పాయింట్లు ప్లస్సయి 18 వేల 147 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 16 కంపెనీలు అత్యధిక విలువల వద్ద ఎండ్ అయ్యాయి. టెక్ మహింద్రా, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ టాప్‌లో నిలిచాయి. సెక్టార్లవారీగా చూసుకుంటే నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఒకటీ పాయింట్ ఆరు శాతం అడ్వాన్స్ అయ్యాయి.

మరోవైపు.. ఫార్మా షేర్లు సున్నా పాయింట్ రెండు మూడు శాతం పడిపోయాయి. వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే.. ఆర్‌వీఎన్‌ఎల్ షేర్ విలువ పది శాతం పెరిగింది. ఈ సంస్థ జాయింట్ వెంచర్‌కి 2 వేల 249 కోట్ల రూపాయల ప్రాజెక్టు దక్కటం కలిసొచ్చింది.

అదానీ గ్రీన్ ఎనర్జీ మరియు అదానీ పవర్ షేర్ల వ్యాల్యూ అప్పర్ సర్క్యూట్‌లో 5 శాతంతో లాకయ్యాయి. 10 గ్రాముల బంగారం రేటు 196 రూపాయలు పెరిగింది. అత్యధికంగా 59 వేల 960 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 583 రూపాయలు తగ్గింది.

గరిష్టంగా 73 వేల 660 రూపాయలు పలికింది. క్రూడాయిల్ రేటు 22 పెరిగింది. ఒక బ్యారెల్ చమురు 6 వేల 180 రూపాయలుగా నమోదైంది. రూపాయి విలువ 6 పైసలు బలహీనపడింది. డాలరుతో పోల్చితే 81 రూపాయల 88 పైసల వద్ద స్థిరపడింది.