Site icon NTV Telugu

Stock Market: ఖతార్‌పై దాడి ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని అనుకుంటున్న తరుణంలో ఇరాన్ చేసిన ప్రతీకార దాడితో మరోసారి మార్కెట్ కుదేల్ అయిపోయింది. ఖతార్‌లోని ఎల్‌ఎన్‌జీ గ్యాస్ క్షేత్రంపై ఒక్కసారిగా ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో చమురు ధరలు పెరిగిపోతాయన్న భయాందోళనలు రేకెత్తడంతో అంతర్జాతీయ మార్కె్ట్లతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్ కూడా ఢమాల్ అయిపోయింది. గురువారం భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. భారీ పతనం దిశగా వెళ్తోంది. అన్ని రంగాల షేర్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఈ వారం ప్రారంభం నుంచి వరుసగా మూడు రోజులు భారీ లాభాల్లో దూసుకెళ్తాయి. ఇరాన్ ప్రతీకార దాడితో పెట్టుబడిదారుల సంపదంతా ఆవిరైపోయింది.

ప్రస్తుతం సెన్సెక్స్ 1,776 పాయింట్లు నష్టపోయి 74, 927 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 537 పాయింట్లు నష్టపోయి 23, 240 దగ్గర కొనసాగుతోంది. బ్యాంకులు, ఆటో, రియల్టీ స్టాక్‌లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గ్యాస్, చమురు సరఫరా అంతరాయాలపై నెలకొన్న ఆందోళనల కారణంగా బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారెల్‌కు మూడు శాతం పెరిగి 111 డాలర్లకు చేరింది. దీంతో పెట్టుబడిదారుల్లో భయాందోళనలు మొదలు కావడంతో మన సూచీలు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఇక రూపాయి విలువ భారీగా పడిపోయింది. జీవనకాల కనిష్ఠాలకు పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92.89గా ఉంది.

Exit mobile version