NTV Telugu Site icon

Vaikuntha Ekadasi 2023: వైకుంఠ ఏకాదశి సందర్భంగా “శ్రీ తిరుపతి వెంటేశ్వర కళ్యాణం” ప్రత్యేక ప్రదర్శన

Vaikunta Ekadasi

Vaikunta Ekadasi

Vaikuntha Ekadasi 2023: వెండితెర కథానాయకుడిగా, ప్రజా నాయకుడిగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. సినిమా నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా సినిమా రంగంపై ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారు. ఆయన సొంతగా సినిమా థియేటర్లు కూడా నిర్మించారు. వాటిలో గుంటూరు జిల్లా తెనాలిలోని రామకృష్ణ(పెమ్మసాని) థియేటర్ ఒకటి. ప్రస్తుతం ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా తెనాలిలో ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఎన్టీఆర్ నటించిన సినిమాలను ఏడాదిపాటు ప్రదర్శించే కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. పై థియేటర్లో సినిమాలు చూసేందుకు వస్తున్న ప్రేక్షకుల్ని చూస్తుంటే ఎన్టీఆర్​ సినిమాలపై అభిమానం ఇప్పటికీ తగ్గలేదనే విషయం రుజువు అవుతోంది.

TSLPRB : ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. చివరి రాతపరీక్ష షెడ్యూల్‌ రిలీజ్‌

రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2న “శ్రీ తిరుపతి వెంటేశ్వర కళ్యాణం” సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. అలానే శతజయంతి ఉత్సవాలలో భాగంగా వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాల నుంచి సంక్రాంతి సంబరాల వరకు ఎన్టీఆర్ కుమారుడు, రామకృష్ణ సినీ స్టూడియోస్ మేనేజింగ్ పార్టనర్ అయిన నందమూరి రామకృష్ణ ఆధ్వర్యంలో- పర్యవేక్షణలో ఎన్టీఆర్ సొంత సినిమాల ప్రదర్శన జరుగుతుండడం విశేషం!. తెలుగు సినిమా చరిత్రలో సంక్రాంతి పండుగ- సినిమాల పండగగా రూపాంతరం చెందడంలో ప్రధాన పాత్రను పోషించిన ఘనత ఎన్టీఆర్‌కు, ఆయన సొంత సంస్థకు దక్కుతుంది. అటువంటి ఎన్టీఆర్ సొంత చిత్రాలను ఆయన శతజయంతి ఉత్సవాలలో కూడా సంక్రాంతి వేడుకగా ప్రదర్శిస్తుండడం.. ఆ కార్యక్రమానికి ఆయన కుమారుడు నందమూరి రామకృష్ణ పర్యవేక్షణ చేయడం మరింత విశేషంగా పేర్కొనవచ్చు.

Show comments