బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తన అందంతో, చలాకీతనంతో యువతను బాగా ఆకట్టుకుంది.. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చింది.. తాజాగా గ్రీన్ శారీలో అదిరిపోయే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి..
టెలివిజన్ పై టాప్ యాంకర్స్ లలో ఒకరుగా శ్రీముఖి వరుస టీవీ షోలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. వరుసగా షోలతో ఆకట్టుకుంటోంది. స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తూ తన అభిమానులు, ఆడియెన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తోంది.. ఇక శ్రీముఖి బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో నెట్టింట హైపర్ యాక్టివ్ గా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన గురించి అప్డేట్స్ ఇస్తూనే వస్తోంది. అందులోనూ ప్రత్యేకమైన రోజు, పండగ వేళల్లో మరింత అందంగా మెరుస్తూ ఆకట్టుకుంటోంది..
ఈ మధ్య ట్రెండీ వేర్ లో హాట్ పోజులతో స్టన్నింగ్ పోజులతో ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో కనిపించి అందరిని షాక్ కు గురి చేసింది.. తాజాగా శ్రీముఖి చిలకపచ్చ చీరకట్టులో సొగసైన ఫోజులు ఇస్తోంది. స్టైలిష్ గా కనిపిస్తుంది.. ఆ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ మధ్య భోళాశంకర్ సినిమాలో నటించింది. ఇప్పుడు మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి..