శ్రీలీల.. శ్రీలీల.. టాలివుడ్ లో ఈ పేరు తెగ వినిపిస్తుంది.. స్టార్ హీరోలు సైతం ఈ అమ్మడు వెనక పడుతున్నారు అంటే అమ్మడు క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.. టాలీవుడ్ లోకి మెరుపులా దూసుకువచ్చింది. పెళ్ళిసందD చిత్రంతో పరిచయమైన ఈ కుర్రభామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది.. ప్రస్తుతం ఈ అమ్మడు వరుసగా ఏడు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది..
టాలివుడ్ లోకి మెరుపు తీగలా వచ్చి దూసుకుపోతుంది.. పెళ్ళిసందD చిత్రంతో పరిచయమైన ఈ కుర్రభామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది. ప్రస్తుతం శ్రీలీల పవన్ , మహేష్ బాబు, బాలకృష్ణ, రామ్ పోతినేని ఇలా వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. ధమాకా చిత్రంతో అయితే శ్రీలీల ఒక ఊపు ఊపేసింది అనే చెప్పాలి. డ్యాన్స్, యాక్టింగ్, అందం ఇలా ప్రతి అంశంలో ఆమెకి తిరుగులేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ ఫిమేల్ డ్యాన్సర్లలో శ్రీలీల ఒకరు. శ్రీలీల తన అందం, అభినయంతో చాలా మంది కుర్ర హీరోయిన్లకు చెక్ పెట్టింది..
ఇంతకు ముందు స్టార్ హీరోల సినిమాలంటే రష్మిక, పూజా హెగ్డే లాంటి ముద్దుగుమ్మల పేర్లు వినిపించేవి. శ్రీలీల సునామీలా దూసుకువచ్చి వారి ప్రభావాన్ని తగ్గించేసింది.. గ్లామర్, డ్యాన్స్ స్కిల్స్ చూస్తుంటే ఫ్యూచర్ లో టాలీవుడ్ ని ఏలడం ఖాయం అని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.. ఒకేసారి పది సినిమాలను లైన్ లో పెట్టినట్లు తెలుస్తుంది.. తాజాగా బ్రహ్మాజీ తనయుడు సంజయ్ ప్రధాన పాత్రలో నటించిన ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ చిత్రం జూలై 29న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ పేరుతో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.. ఆ వేడుకకు ముఖ్య అతిధిగా శ్రీలీలను ఆహ్వానించారు.. ఈ అమ్మడు తన నేచురల్ అందంతో కట్టిపడేస్తుంది. ఈ ఫొటోస్ చూస్తుంటే శ్రీలీల చిలిపిగా, క్యూట్ గా మెస్మరైజ్ చేసే పిక్స్ తో కుర్ర హృదయాల్ని ఆడుకుంటోంది..శ్రీలీల క్యూట్ లుక్స్, అమాయకమైన చూపులకు యువత ఫిదా అవుతున్నారు. పెదవుల అందంతో ఊరిస్తూ శ్రీలీల ప్రీ రిలీజ్ వేడుకలో మెరుపులు మెరిపించింది.. ప్రస్తుతం ఈ అమ్మడు రామ్ పోతినేని సరసన స్కంద, మహేష్ బాబు గుంటూరు కారం, బాలయ్య భగవంత్ కేసరి చిత్రాల్లో నటిస్తోంది..
