ప్రస్తుతం టాలివుడ్ లో శ్రీలీల పేరుకు యమ క్రేజ్ ఉంది.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. అతి తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా టాక్ ను సొంతం చేసుకుంది..తన టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతుండటంతో ఈ బ్యూటీ కెరీర్ దూసుకుపోతోంది.. రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించిందో లేదో ఈ ముద్దుగుమ్మ టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీలా గ్యాప్ లేకుండా షూటింగ్స్ కు హాజరవుతోంది.. ఇక శ్రీలీలా సినిమాలకు బ్రేక్ తీసుకుంటుందనే వార్తలు సోషల్ మీడియా లో వినిపిస్తున్నాయి..
పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కుర్ర భామ రవితేజ ‘ధమాఖా’తో పాటు బాలయ్యతో భగవంత్ కేసరి సినిమాలలో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ లను అందుకున్న విషయం తెలిసిందే. ఆదికేశవ నిరాశ పరిచిన గుంటూరు కారం సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. శ్రీలీలాకు అతి తక్కువ సమయంలో బాలయ్య, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ పోతినేని వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ రావడం విశేషం. ఇప్పుడే ఈ స్థాయిలో శ్రీలీలా ఊపుతుందంటే.. మున్ముందు ఏ స్థాయిలో సంచలనం సృష్టించబోతోందో అని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు..
ఒకవైపు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న శ్రీలీలా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తూ తన ఫ్యాన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.ఇదిలా ఉండగా.. ఇంత బిజీ షెడ్యూల్ లో ఉన్న అమ్మడు సినిమాలకు బ్రేక్ తీసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం ఎమ్‌బీబీఎస్ చదువుతూనే సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ. కెరీర్, చదువూ రెండూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇక శ్రీలీల తల్లి కూడా డాక్టర్ కావడం విశేషం. అయితే పరీక్షల కోసం శ్రీలీల బ్రేక్ తీసకున్నప్పటికీ ఆమె ఇప్పటివరకూ కొత్త సినిమాకి సైన్ చేయకపోవడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు..
ప్రస్తుతం ఎమ్‌బీబీఎస్ చదువుతూనే సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ. కెరీర్, చదువూ రెండూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇక శ్రీలీల తల్లి కూడా డాక్టర్ కావడం విశేషం. అయితే పరీక్షల కోసం శ్రీలీల బ్రేక్ తీసకున్నప్పటికీ ఆమె ఇప్పటివరకూ కొత్త సినిమాకి సైన్ చేయకపోవడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.. దీనిపై అమ్మడు క్లారిటీ ఇచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే.. ఇక శ్రీలీల చేతిలో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మాత్రమే ఉంది.. సినిమాల ఎంపిక విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోబోతుందని టాక్..