పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న యంగ్ సెన్సేషన్ శ్రీలీల పారితోషికం ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : Dhurandhar TheRevenge : ధురంధర్ 2 ఒక్కో టికెట్ ధర రూ. 3100 అయినా దొరకని టికెట్స్
టాలీవుడ్‌లో అతి తక్కువ సమయంలోనే స్టార్ హోదా దక్కించుకున్న శ్రీలీల ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తాజా సమాచారం ప్రకారం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో తన పాత్ర కోసం ఆమె దాదాపు రూ. 2 కోట్ల పారితోషికాన్నితీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా ఆమెకున్న క్రేజ్, డ్యాన్సింగ్ స్కిల్స్ మరియు యూత్ ఫాలోయింగ్ దృష్ట్యా మేకర్స్ కూడా ఈ భారీ మొత్తాన్ని ఇచ్చేందుకు వెనుకాడలేదని తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీలీల పాత్ర ఎంతో ఎనర్జిటిక్‌గా ఉండబోతోందని పవన్ కళ్యాణ్‌తో ఆమె కెమిస్ట్రీ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ క్యూరియాసిటీని పెంచాయి. ఈ స్పైసీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ నేడు రాత్రి ప్రియమియర్స్ తో ఓవర్సీస్ లో రిలీజ్ అవుతుండగా ఉగాది కానుకగా గురువారం తెల్లవారుజామున షోస్ తో ఈ గురువారం థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే సాలిడ్ అడ్వాన్స్ బుకింగ్స్ తో జోరుమీదున్నాడు ఉస్తాద్ భగత్ సింగ్.
