Site icon NTV Telugu

Sreeleela : ట్రెండీ వేర్ లో శ్రీలీలా లేటెస్ట్ స్టిల్స్ అదుర్స్..

Sreeleeelaa

Sreeleeelaa

టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల గురించి ఎంత చెప్పినా తక్కువే.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ ను అందుకుంది. మొదటి సినిమాతోనే స్టార్ రేంజ్ ను సొంతం చేసుకుంది.. ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తుంది.. ఇక సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ పిక్స్ ను షేర్ చేస్తూ వస్తుంది..

తాజాగా అదిరిపోయే స్టిల్స్ తో ఆకట్టుకుంది.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఈ ఏడాది అమ్మడుకు అంతగా కలిసిరాలేదు.. గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడుకు సినిమా ఆశించిన హిట్ ను అందుకోలేక పోయింది.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారును ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంది.. తాజాగా ట్రెండీ వేర్ లో అదిరిపోయే స్టిల్స్ ను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..

ఇకపోతే సినిమాల విషయానికొస్తే.. ఐటమ్ సాంగ్ లో నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న గోట్ లో ఈ అమ్మడు ఐటమ్ సాంగ్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమాతో కొలివుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది.. దీంతో పాటు ఓ సినిమాలో కూడా నటిస్తుందని టాక్..

Exit mobile version