NTV Telugu Site icon

Sreeleela : పింక్ డ్రెస్ లో మెరిసిపోతున్న శ్రీలీలా.. ఆ చూపులకే కుర్ర కారు ఫిదా..

Sreeleela (2)

Sreeleela (2)

కన్నడ బ్యూటీ శ్రీలీలా ఇప్పుడు టాలివుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది.. పెళ్ళిసందD చిత్రంతో పరిచయమైన ఈ కుర్రభామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది.. ప్రస్తుతం ఈ కుర్ర హీరోయిన్ వరుస సినిమాలతో బిజీగా ఉంది.. ప్రస్తుతం ఈ పవన్ , మహేష్ బాబు, బాలకృష్ణ, రామ్ పోతినేని ఇలా వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది..

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ధమాకా చిత్రంతో అయితే శ్రీలీల ఒక ఊపు ఊపేసింది అనే చెప్పాలి. డ్యాన్స్, యాక్టింగ్, అందం ఇలా ప్రతి అంశంలో ఆమెకి తిరుగులేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ ఫిమేల్ డ్యాన్సర్లలో శ్రీలీల ఒకరు.. డ్యాన్స్, నటనతో అందరిని తనవైపు తిప్పుకుంది.. స్టార్ హీరోయినలకు సైతం చెక్ పెట్టేసింది.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ అమ్మడు పేరు వినిపిస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా శ్రీలీల అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న సైమా అవార్డ్స్ వేడుకలో మెరిసింది. సైమా అవార్డ్స్ లో శ్రీలీలే క్యూట్ పిక్స్ ఆకర్షణీయంగా మారాయి. అందరి చూపు శ్రీలీల ధరించిన పింక్ డ్రెస్ పైనే పడింది..

ఆ డ్రెస్సులో అమ్మడు లుక్స్ కిరాక్.. ఆమె అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు.. ఆమె లేలేత పరవాలకు మంత్ర ముగ్దులు అవుతున్నారు.. మొత్తానికి ఈ అవార్డ్స్ వేడుకలో అందరి చూపు ఈమె వైపే ఉంది.. ఇకపోతే ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. రామ్ పోతినేని సరసన స్కంద, మహేష్ బాబు గుంటూరు కారం, బాలయ్య భగవంత్ కేసరి చిత్రాల్లో నటిస్తోంది.. శ్రీలీలా జోరు టాలివుడ్ లో నడుస్తుంది..

Show comments