ICC ODI Rankings: భారత దిగ్గజ క్రికెట్ ద్వయం మధ్య నంబర్-1 కుర్చీ కోసం రేర్ క్లాష్ నడుస్తుంది. తాజాగా టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి రెండవ స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో మరో టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. కోహ్లీ రోహిత్ కంటే కేవలం ఎనిమిది పాయింట్లు వెనుకబడి ఉన్నాడు.
READ ALSO: Baz Drone: ప్రపంచంలోనే మొదటి ‘Sky Hunter’ డ్రోన్ – భారీ ప్రొడక్షన్‌కు సిద్ధమైన భారత్!
నిజానికి 37 ఏళ్ల కింగ్ కోహ్లీ ఏప్రిల్ 2021 నుంచి ICC ODI బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో లేడు. కానీ దక్షిణాఫ్రికాతో జరిగిన ODI సిరీస్‌లో కింగ్ అద్భుతమైన ప్రదర్శన తర్వాత, ఆయన మరోసారి ICC ODI బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానానికి దగ్గరగా వచ్చాడు. వన్డే సిరీస్‌లో 302 పరుగులు చేసినందుకు కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. అలాగే కింగ్ విశాఖపట్నంలో జరిగిన సిరీస్ చివరి మ్యాచ్‌లో అజేయంగా 65 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. ఈ సూపర్ ప్రదర్శన కోహ్లీకి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో స్థానం సంపాదించిపెట్టింది. దీంతో ఈ స్టార్ బ్యాట్స్‌మన్ రెండు స్థానాలు ఎగబాకి రెండవ స్థానానికి చేరుకున్నాడు.
నంబర్ 1 కోసం RO-KO మధ్య పోరాటం
వాస్తవానికి భారత స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ – రోహిత్ శర్మ ఇద్దరూ దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో అసాధారణంగా రాణించారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రోహిత్ శర్మ 146 పరుగులు చేయగా, కింగ్ కోహ్లీ మొత్తం సిరీస్‌లో 302 పరుగులు చేశాడు. ఇప్పుడు ఈ ఇద్దరు జనవరి 11న న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం మళ్లీ మైదానంలోకి దిగనున్నారు. ఈ సిరీస్‌లో అద్భుతమైన ఆటతీరుతో రోహిత్ అగ్రస్థానాన్ని పదిలం చేసుకోడానికి చూస్తుంటే, కోహ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. “హిట్‌మ్యాన్” ప్రస్తుతం ICC ODI బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 781 రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 773 రేటింగ్‌తో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు.
ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టుకు చెందిన శ్రేయాస్ అయ్యర్ ఒక స్థానం కోల్పోయి 10వ స్థానానికి పడిపోయాడు. టాప్-10లో న్యూజిలాండ్‌కు చెందిన డారిల్ మిచెల్, ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఇబ్రహీం జాద్రాన్ కూడా ఒక్కో స్థానాన్ని కోల్పోయి ఇద్దరూ వరుసగా మూడు, నాల్గవ స్థానాలకు పడిపోయారు. శుభ్‌మాన్ గిల్ ఐదవ స్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్‌కు చెందిన బాబర్ అజామ్ ఆరో స్థానంలో, శ్రీలంకకు చెందిన చరిత్ర్ అసలంక 9వ స్థానంలో ఉన్నారు.
ఐసిసి పురుషుల టీ20ఐ ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్లు లాభపడ్డారు. అక్షర్ పటేల్ రెండు స్థానాలు ఎగబాకి 13వ స్థానానికి, అర్ష్‌దీప్ సింగ్ మూడు స్థానాలు ఎగబాకి 20వ స్థానానికి, జస్ప్రీత్ బుమ్రా ఆరు స్థానాలు ఎగబాకి 25వ స్థానానికి చేరుకున్నారు. కటక్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20ఐలో అద్భుతమైన ప్రదర్శన చేసిన ఈ భారత బౌలర్లకు అవార్డులు కూడా దక్కాయి.
టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మిచెల్ స్టార్క్ మూడవ స్థానానికి చేరుకున్నాడు. మొదటి రెండు యాషెస్ టెస్ట్‌లలో 18 వికెట్లు తీసిన తర్వాత మిచెల్ తొలిసారిగా తన కెరీర్‌లో అత్యుత్తమ మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇంగ్లాండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్ రెండు స్థానాలు దిగజారి నాలుగో స్థానానికి పడిపోయాడు. అదే సమయంలో రచిన్ రవీంద్ర తొమ్మిది స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి, అలాగే టామ్ లాథమ్, వెస్టిండీస్‌కు చెందిన షాయ్ హోప్, జస్టిన్ గ్రీవ్స్, ఫాస్ట్ బౌలర్ కేమర్ రోచ్ తమ ర్యాంకింగ్‌లను మెరుగుపరుచుకున్నారు.
ICC ర్యాంకింగ్స్
ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ (913) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, టీ 20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో వరుణ్ చక్రవర్తి (782) అగ్రస్థానంలో ఉన్నాడు . టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా ( 455) అగ్రస్థానంలో ఉన్నాడు.
READ ALSO: New Celeb Trend : పెళ్లయ్యాక విడాకుల కంటే ముందే విడిపోవడమే బెటర్
