Snake in Fridge: బుస్ అని సౌండ్ వస్తే ఏంటని డోర్ తీశారు.. అంతే ఒక్కసారిగా షాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Snake in Fridge: మానవుడు తన అవసరాల కోసం అడవులను హరిస్తున్నాడు. దీంతో అక్కడ నివసించే వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడం ఇటీవల ఎక్కువైంది. పాములు తమ పుట్టలను వదిలి అవి తమకు అనుకూలమైన ప్రదేశాల్లో దూరుతున్నాయి. ఇండ్లలోనూ, వాహనాల్లో దూరిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతీ రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా కర్ణాటకలోని తుమకూరులో ఓ నాగుపాము ఇంట్లోని ఫ్రిజ్ కంప్రెషర్‌లోకి దూరింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆరు అడుగుల పొడవు గోల్డ్ కలర్ లో ఉన్న నాగుపామును చూసి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అప్పటి దాకా బుస్ బుస్ అని శబ్ధం వస్తుంటే ఎక్కడినుంచి వస్తుందోనని ఇళ్లంతా గాలించారు. చివరకు ఫ్రిజ్ వెనుకభాగంలో చూడగా బుసలు కొడుతున్న నాగుపామును గమనించారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ సహయంతో ప్రెషర్‌లో దూరిన నాగుపామును పట్టేశారు. ఆ సమయంలో నాగుపాము పడగవిప్పుతూ బుసలు కొట్టింది. ఈ దృశ్యాన్ని చూసి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ ఆ పామును ఓ డబ్బాలో వేసి, అనంతరం అడవిలో వదిలిపెట్టాడు. ఇటీవల ఓ యువకుడి దుప్పుట్లోకి దూరిన నాగుపాము.. రాత్రంతా అతనితో పాటు నిద్రించిన ఘటన చూశాం.
Also Read
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్‌గా రిషభ్ పంత్..
తాజావార్తలు
-
Makutam Release Date: దర్శకుడిగా విశాల్‌కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్‌కు కౌంట్‌డౌన్!
-
Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్‌తో వస్తోన్న అల్లు అర్జున్
-
Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
-
Trump Marine One: ట్రంప్‌కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
ట్రెండింగ్
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్‌ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!