ప్రపంచ క్రికెట్ లీగ్‌ల్లో 15 ఏళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నెంబర్ వన్‌గా కొనసాగుతోంది. ప్లేయర్లపై కాసుల వర్షం కురిపిస్తూ ఏడాది ఏడాదికీ గణనీయమైన మార్కెట్‌ను పెంచుకుంటోంది. అందుకే వరల్డ్ క్రికెట్‌లో ఎన్ని టీ20 ఫ్రాంచైజీ లీగ్‌లు పుట్టికొచ్చినా.. ఐపీఎల్‌కు ఏదీ సాటి రాదంటున్నారు విశ్లేషకులు. కాగా ఎంతో మంది యువ ఆటగాళ్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసిన చరిత్ర ఐపీఎల్‌కు ఉంది. కానీ కొంత మంది పాక్ ఆటగాళ్లు, అభిమానులు మాత్రం ఐపీఎల్ కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ బెటర్ అంటూ గొప్పలు పలుకుతుంటారు. అయితే బీసీసీఐ ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మరోసారి తేలిపోయింది. తాజాగా జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ వేలంతో ఇది మరోసారి రుజువైంది.
Also Read: Rohit Sharma: రోహిత్‌కు అందుకే సరైన గుర్తింపు దక్కలేదు: ఆసీస్ మాజీ క్రికెటర్
విమెన్స్ ప్రీమియర్ లీగ్-2023 వేలంలో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న క్రికెటర్‌గా మంధాన నిలిచింది. రూ.3.4 కోట్ల భారీ ధరకు ఈ స్టార్ ఓపెనర్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. అయితే పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కెప్టెన్ బాబర్ అజామ్, పేసర్ షహీన్ అఫ్రిదీ వంటి స్టార్ ఆటగాళ్లు కంటే మంధాన ఎక్కువ మొత్తాన్ని అందుకోవడం విశేషం. పీఎస్‌ఎల్‌లో బాబర్ ప్లాటినమ్ కేటిగిరీలో ఉన్నాడు. ఈ కేటగిరీలో ఉన్న ప్లేయర్లకు పాక్ కరెన్సీలో 3.60 కోట్లు అందుతుంది. కాగా ఈ కేటగిరీలో బాబర్ ఒక్కడే ఉండడం గమనార్హం. అంటే బాబర్ ఈ ఏడాది సీజన్‌కు గాను రూ. 3.60 కోట్ల మొత్తాన్ని అందుకున్నాడు. బాబర్ అందుకునే మొత్తం రూ. 3 కోట్ల 60 లక్షలు.. అదే భారత కరెన్సీలో వచ్చేసరికి రూ. కోటి 23 లక్షలు మాత్రమే. అంటే పీఎస్‌ఎల్‌లో అత్యధిక మొత్తం అందుకుంటున్న బాబర్ కంటే స్మృతి మంధాన రెండున్నరెట్లు ఎక్కువ మొత్తాన్ని మహిళల ప్రీమియర్ లీగ్ ద్వారా అందుకోబోతోంది. దీంతో ఫ్యాన్స్ పాక్ క్రికెటర్లను ఆడుకుంటున్నారు. ఫన్నీ మీమ్స్‌తో నెట్టింట సందడి చేస్తున్నారు.
Babar Azam salary in PSL: 1.4cr
Mandhana salary in WPL: 3.2crSmriti >>> Babar in both batting and net worth 🔥#WPLAuction | #WPL pic.twitter.com/1P8z64Ji0M
— Simmu✨ (@meownces) February 13, 2023
Babar Azam salary in PSL: 1.4cr
Smriti Mandhana salary in WPL: 3.2cr
Ellyse Perry salary in WPL: 1.7crSmriti & Ellyse both >>> Babar in both batting and net worth 🔥#WPLAuction | #WPL
— Shekhar (@Shekhar499) February 13, 2023