NTV Telugu Site icon

Bank Jobs: SIDBIలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం

Sidbi

Sidbi

SIDBI Bank Jobs: SIDBI అంటే స్మాల్ ఇండస్ట్రీస్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్ లో ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థుల కోసం భారీ రిక్రూట్మెంట్ పడింది. ఈ రిక్రూట్మెంట్ కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. 8 నవంబర్ 2024 నుండి బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ www.sidbi.inలో దరఖాస్తు నింపే పక్రియ కూడా ప్రారంభించబడింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ బ్యాంక్ రిక్రూట్మెంట్‌లో చివరి తేదీ 2 డిసెంబర్ 2024 వరకు ఫారమ్‌ను పూరించవచ్చు. దరఖాస్తు రుసుము చెల్లించడానికి కూడా ఇదే చివరి తేదీ. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) భారతదేశంలోని ఒక ప్రధాన ఆర్థిక సంస్థ. ఇది చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధిలో నిమగ్నమై ఉంది. SIDBIలో ఆఫీసర్ స్థాయి ఉద్యోగం పొందడానికి ఇది గొప్ప అవకాశం. బ్యాంకు ఏ పోస్ట్ కోసం ఎన్ని ఖాళీలను విడుదల చేసింది? అభ్యర్థుల అర్హతలు ఇలా ఉన్నాయి.

అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్-A) జనరల్ – 50 పోస్టులు, మేనేజర్ (గ్రేడ్-బి) జనరల్ – 10 పోస్టులు, మేనేజర్ (గ్రేడ్-B) లీగల్ – 06 పోస్టులు, మేనేజర్ (గ్రేడ్-B) IT – 06 పోస్టులు మొత్తంగా 72 పోస్టులను భర్తీ చేయనున్నారు. SIDBI గ్రేడ్ A , గ్రేడ్ B ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత రంగంలో కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. కాగా ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థుల ఉత్తీర్ణత శాతాన్ని 55 శాతంగా నిర్ణయించారు. అభ్యర్థులు రిక్రూట్మెంట్ అధికారిక నోటిఫికేషన్ నుండి పోస్ట్ వారీగా అర్హత సంబంధిత సమాచారాన్ని వివరంగా తనిఖీ చేయవచ్చు. SIDBI రిక్రూట్‌మెంట్ 2024 అధికారిక నోటిఫికేషన్ కోసం https://www.sidbi.in/head/uploads/career_document/SIDBI-DETAILED-WEB-ADVT-08112024.pdf క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి.

వయోపరిమితి- గ్రేడ్ A పోస్టుకు దరఖాస్తు చేయడానికి, అభ్యర్థుల కనీస వయస్సు 21 సంవత్సరాలు నుండి గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి. అయితే గ్రేడ్ B పోస్ట్ కోసం, దరఖాస్తుదారుల వయస్సు కనీసం 25 సంవత్సరాల నుండి గరిష్టంగా 33 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. వయస్సు 2 డిసెంబర్ 2024 నాటికి లెక్కించబడుతుంది. రిజర్వ్డ్ కేటగిరీలకు గరిష్ట వయస్సులో సడలింపు ఇవ్వబడుతుంది.
ఇక జీతం విషయానికి వస్తే.. గ్రేడ్ A అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు అభ్యర్థులు నెలకు రూ. 1,00,000, గ్రేడ్ B మేనేజర్ పోస్టుకు అభ్యర్థులు నెలకు రూ. 1,15,000 పొందుతారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంఐపిక పక్రియ జరుగుతుంది.

దరఖాస్తు రుసుము చూస్తే.. జనరల్, OBC, EWS కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు సమయంలో రూ. 1100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరీ అభ్యర్థులకు ఈ రుసుము రూ.175గా నిర్ణయించారు.
దశ-I పరీక్ష తేదీ 22 డిసెంబర్ 2024, దశ-II పరీక్ష తేదీ 19 జనవరి 2025, ఇంటర్వ్యూ అంచనాగా ఫిబ్రవరి 2025 లో జరుగుతుంది. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ఏదైనా ఇతర సమాచారం కోసం, అభ్యర్థులు SIDBI బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Show comments