Small Size Beds in Paris Olympics Athletes Village: పారిస్ ఒలింపిక్స్ 2024కు సమయం దగ్గరపడుతోంది. మరో ఐదు రోజుల్లో విశ్వక్రీడలు ప్రారంభం కానున్నాయి. జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఒలింపిక్స్ జరగనున్నాయి. విశ్వక్రీడలను ఘనంగా నిర్వహించేందుకు పారిస్ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలోనే క్రీడాకారుల కోసం ఒలింపిక్ విలేజ్‌లో భిన్న ఏర్పాట్లు చేశారు. ఒలింపిక్స్ సమయంలో అథ్లెట్లు శృంగారంలో పాల్గొనకుండా నిరోధించడానికి ‘యాంటీ సెక్స్ బెడ్స్’ సిద్ధం చేశారు. అంతేగాక బెడ్ సైజ్‌ను కూడా తగ్గించారు.
కరోనా మహమ్మారి కారణంగా టోక్యో ఒలింపిక్స్‌లో శృంగారంను నిషేధించిన విషయం తెలిసిందే. కఠిన నిబంధనల మధ్య గత విశ్వక్రీడలు జరిగాయి. ఈసారి ఆంక్షలను ఎత్తివేశారు. దాంతో ఒలింపిక్ విలేజ్‌లో క్రీడాకారుల కోసం దాదాపు 3 లక్షల కండోమ్‌లను నిర్వాహకులు అందుబాటులో ఉంచుతున్నారు. అయితే శృంగారాన్ని అడ్డుకోవడానికి నిర్వాహకులు ప్రయత్నించడం విశేషం. ఇద్దరు వ్యక్తులు సౌకర్యవంతంగా పడుకోవడానికి వీళ్లేకుండా.. బెడ్ పరిమాణంను తగ్గించారు. అంతేగాక బెడ్‌లను యాంటీ సెక్స్ పదార్థాలతో తయారుచేశారు. అథ్లెట్లకు శృంగారంపై పెద్దగా ఆసక్తి కలగకుండా ఈ చర్యలు తీసుకున్నారు.
యాంటీ సెక్స్ బెడ్‌లను జపనీస్ కంపెనీ ఎయిర్‌వేవ్ తయారు చేసింది. ఈ బెడ్‌లను గత ఒలింపిక్స్‌లో కూడా వాడారు. ఒలింపిక్స్‌లో కండోమ్‌లు అందుబాటులో ఉంచడం ఎప్పటినుంచో ఉంది. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే ఉద్దేశంతో కండోమ్‌లను అందుబాటులో ఉంచుతున్నారు. 1988 సియోల్ ఒలింపిక్స్ నుంచి ఈ పద్దతి కొనసాగుతోంది. టోక్యో ఒలింపిక్స్‌లో దాదాపు లక్షన్నర కండోమ్‌లను అందుబాటులో ఉంచగా.. ఈసారి ఆ సంఖ్య డబుల్ అయింది.