Site icon NTV Telugu

Visakhapatnam: రైలును తలపించే క్యాప్సుల్‌ హోటల్.. ఎక్కడో కాదు మన విశాఖ రైల్వే స్టేషన్‌లోనే…

Capsule Hotel

Capsule Hotel

క్యాప్సుల్‌ హోటల్స్‌ గురించి తెలిసే ఉంటుంది. తక్కువ స్పేస్‌లో సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకునేందుకు వీటిని ఏర్పాఉటు చేశారు. వీటినే స్లీపింగ్ పాడ్‌లు అని కూడా పిలుస్తారు. తొలత అభివృద్ధి చెందిన జపాన్‌ దేశంలో ఇవి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ స్లీపింగ్‌ పాడ్‌లు వ్యాపిస్తున్నాయి. ఈ అధునాతన విశ్రాంతి పడకలు ఇప్పుడు విశాఖ రైల్వే స్టేషన్‌లో సైతం ఏర్పాటు చేశారు. తూర్పు కోస్తా రైల్వేజోన్‌లో తొలిసారి ఈ రకమైన వసతిని విశాఖలోనే ఏర్పాటు చేశామని డీఆర్ఎం లలిత్ బోహ్రా వెల్లడించారు. విశాఖ రైల్వేస్టేషన్‌లోని ఒకటో ఫస్ట్ ప్లాట్‌ఫాం మొదటి అంతస్తులో ఇవి అందుబాటులో ఉన్నాయి.

READ MORE: Bangladesh: భారత్‌కు పక్కలో బళ్లెంలా బంగ్లాదేశ్, మరో దేశం నుంచి ఆయుధాల సేకరణ..

వాస్తవానికి ఇది చూడటానికి రైలు బోగీ, స్లీపర్‌ బస్‌ మాదిరిగా కనిపిస్తోంది. వీటిలో కింద, పైన ఎదురెదురుగా క్యాప్సుల్స్‌ను అమర్చారు. రక్షణ, గోపత్య నిమిత్తం మధ్యలో కర్టెన్స్‌ ఏర్పాటు చేశారు. ఏసీ సదుపాయమూ ఉంది. ఈ క్యాప్సుల్‌ హోటల్ లో 73 సింగిల్ బెడ్‌ పాడ్‌లు ఉన్నాయి. 15 డబుల్ బెడ్‌లు ఉండగా.. మహిళల కోసం 18 బెడ్స్ సపరేటుగా ఏర్పాటు చేశారు. సింగిల్‌ బెడ్‌కు 3 గంటలకు గానూ ఒక్కొక్కరికి రూ.200 తీసుకుంటారు. ఒకవేళ మూడు గంటలు దాటితే 24 గంటల వరకు రూ.400 కట్టాల్సి ఉంటుంది. డబుల్‌ బెడ్‌ అయితే 3 గంటల వరకు రూ.300, ఆపై 24 గంటలకు రూ.600 ఛార్జ్ చేస్తున్నారు. అందులో ఒక టీవీతో పాటు, సోఫాలు కూడా ఉన్నాయి. ఈ బెడ్ తీసుకున్న కస్టమర్లకు ఉచిత వైఫైతో పాటు వేడి నీరు, స్యాక్స్, రైళ్లకు సంబంధించి సమాచార డెస్క్ ఏర్పాటు చేశారు.

Exit mobile version