Site icon NTV Telugu

SIR Effect: కేరళ, అండమాన్–నికోబార్, ఛత్తీస్‌గఢ్‌లో లక్షల సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగింపు..!

Sir

Sir

SIR Effect: భారత ఎన్నికల కమిషన్ (ECI) మంగళవారం (డిసెంబర్ 23) ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR) కింద సిద్ధం చేసిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కేరళ నుంచి 24 లక్షలకు పైగా ఓటర్ల పేర్లు తొలగించబడినట్లు ప్రధాన ఎన్నికల అధికారి రథన్ వెల్లడించారు. డ్రాఫ్ట్ జాబితాను ఈసీఐ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడంతో పాటు, రాజకీయ పార్టీలకు కూడా ప్రతులను అందించారు.

Motorola Edge 70 అమ్మకాలు షురూ.. ఎక్కడ కొనచ్చంటే..?

డ్రాఫ్ట్ జాబితా ప్రకారం, కేరళలో మొత్తం 2,54,42,352 మంది ఓటర్లు నమోదు అయ్యారు. SIR ప్రక్రియలో భాగంగా 24,08,503 మంది ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. తొలగించిన వారిలో 6,49,885 మంది మృతి చెందిన ఓటర్లు, 6,45,548 మంది కనబడని (Untraceable) ఓటర్లు, 8,16,221 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారు ఉన్నారు. వీరితోపాటు 1,36,029 డూప్లికేట్ ఎంట్రీలు, 1,60,830 ఇతర కారణాల కింద ఉన్న ఓటర్లు గుర్తించి తొలగించారు. సవరణకు ముందు కేరళలో 2,78,50,855 మంది ఓటర్లు ఉండగా.. ఈ తొలగింపులు మొత్తం ఓటర్లలో 8.65% గా ఉన్నాయని అధికారులు తెలిపారు. డ్రాఫ్ట్ జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు జనవరి 22 వరకు స్వీకరిస్తామని, ఫిబ్రవరి 21న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని కెల్కర్ పేర్కొన్నారు.

మరోవైపు అండమాన్–నికోబార్ దీవుల డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను కూడా ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఈ జాబితాలో 2,46,390 మంది ఓటర్లు ఉన్నారు. SIR ప్రక్రియ తర్వాత 64,014 మంది ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. వీరిలో 9,191 మంది మృతులు,51,906 మంది ఇతర ప్రాంతాలకు మారిన లేదా చిరునామాల్లో లేని వారు, 2,917 మంది బహుళ చోట్ల నమోదు అయిన ఓటర్లు ఉన్నారు. సవరణకు ముందు అండమాన్–నికోబార్‌లో మొత్తం 3,10,404 మంది ఓటర్లు ఉన్నారు.

ICC Rankings: చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. తొలిసారిగా వరల్డ్ నెం.1 కైవసం..!

ఇదిఇలా ఉండగా.. ఎన్నికల కమిషన్ ఛత్తీస్‌గఢ్ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను కూడా విడుదల చేసింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెబ్‌సైట్‌లో వివరాలను అప్‌లోడ్ చేశారు. ఈ జాబితా ప్రకారం ఆ రాష్ట్రంలో 27 లక్షలకు పైగా ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. ఈ SIR ప్రక్రియలో 6,42,234 మంది మృతి చెందిన ఓటర్లు, 19,13,540 మంది ఇతర ప్రాంతాలకు మారిన లేదా కనపడని ఓటర్లు, 1,79,043 మంది అనేక చోట్ల నమోదు అయిన ఓటర్లు తొలగించబడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 2,12,30,737 మంది ఓటర్లలో, 1,84,95,920 మంది తమ ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారు. ఇది SIR తొలి దశలో భారీ ప్రజాభాగస్వామ్యానికి నిదర్శనమని ఈసీ పేర్కొంది.

Exit mobile version