NTV Telugu Site icon

Simran: ఏంటి మేడమ్ ఆ ఎనర్జీ.. మాస్ స్టెప్పులతో అదరగొట్టారు…

Simraan

Simraan

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సిమ్రాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.. సన్నజాజి నడుముతో అప్పటి యువతను కట్టిపడేశారు సిమ్రాన్. పలు తమిళ, తెలుగు, హిందీ, మలయాళం లలో నటించి ప్రేక్షకులను మెప్పించింది సిమ్రాన్. 2004 వరకు స్టార్ హీరోయిన్ గా రాణించింది.. ఆ తర్వాత పలు కీలక పాత్రలో కనిపిస్తూ వస్తుంది.. ఈ మధ్య ఈమె సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఈమె కొంతకాలం సినిమాలకు దూరంగా ఉందన్న విషయం తెలిసిందే.. ఇప్పుడు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి లు చేస్తున్నారు సిమ్రాన్. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో సిమ్రాన్ అంతగా స్పీడ్ చూపించడం లేదు. అడపాదడపా లు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో మాత్రం సిమ్రాన్ చాలా యాక్టివ్ గా ఉంటారు.. లేటెస్ట్ ఫొటోలతో పాటు వీడియోలను కూడా పోస్ట్ చేస్తుంటారు.. అవి క్షణాల్లో వైరల్ అవుతాయి..

ఇదిలా ఉండగా ఈమె వయసు ప్రస్తుతం 47 అయినా కూడా ఏమాత్రం ఎనర్జీ తగ్గలేదు ఈ చిన్నదానికి.. అదిరిపోయే డాన్స్ లతో ఆకట్టుకుంటున్నారు సిమ్రాన్. తాజాగా మహేష్ బాబు మాస్ సాంగ్ కు స్టెప్పులేసి అలరించింది. మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం లో కుర్చీ మడతబెట్టి సాంగ్ కు సిమ్రాన్ మాస్ స్టెప్పులతో అదరగొట్టింది.. ఆమె ఎనర్జీని చూస్తే షాక్ అవ్వాల్సిందే..అంత బాగా డ్యాన్స్ ను అదరగోట్టారు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..