Siachen Tragedy: లడఖ్‌లోని సియాచిన్ సెక్టార్లోని బేస్ క్యాంప్‌పై హిమపాతం విరిగిపడటంతో ముగ్గురు ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు మంగళవారం తెలిపారు. ఆదివారం సముద్రమట్టానికి 12 వేల అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ బేస్ క్యాంప్‌లో డ్యూటీలో మహర్ రెజిమెంట్‌కు చెందిన ఇద్దరు అగ్నివీర్లతో సహా ముగ్గురు సైనికులు మంచు కింద చిక్కుకున్నారు. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. రెస్క్యూ టీం 5 గంటల పాటు ఎంతో కష్టపడి కెప్టెన్‌ను రక్షించాయి. అలాగే ముగ్గురు సిబ్బంది మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు పేర్కొన్నారు.
READ ALSO: Nara Lokesh: కేటీఆర్‌ని ఎందుకు కలవకూడదు..? దానికి రేవంత్‌రెడ్డి పర్మిషన్ తీసుకోవాలా..?
ఈ ప్రదేశం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, అత్యంత సవాలుతో కూడిన సైనిక పోస్ట్‌లలో ఒకటి. అధిక ఎత్తులో ఉన్న సియాచిన్ తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు తరచుగా వార్తల్లో నిలుస్తుంది. హిమపాతాలు, మంచు తుఫాను కారణంగా సైన్యం సంవత్సరాలుగా అనేక సంఖ్యలో ప్రాణనష్టాలను చవిచూసింది. నియంత్రణ రేఖకు సమీపంలో వ్యూహాత్మక స్థానాలను భద్రపరచడానికి సైన్యం ఈ ప్రాంతంలో నిరంతరం గస్తి కాస్తుంది. ఇక్కడ డ్యూటీలో ఉండే దళాలు ప్రత్యేకమైన యుద్ధ శిక్షణ పొందుతాయి.
READ ALSO: Qatar Bombing: ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడి.. హమాస్ నాయకత్వం లక్ష్యంగా పేలుళ్లు
