Shubman-Sara: వాలెంటైన్స్ డే సాక్షిగా గిల్, సారా దొరికేశారు.. ఇదిగో క్లారిటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ప్రేమలో ఉన్నట్లు చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కొన్నిసార్లు మీడియా కంటికి చిక్కినా కూడా తమ మధ్య ఏంలేదన్నట్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. తాజాగా వీరు అడ్డంగా బుక్కయారు. సారాతో రిలేషన్ విషయంలో ఆధారాలతో సహా దొరికిపోయాడు. ఇన్నాళ్లు తాను దాచిన నిజాన్ని తన వాలెంటైన్స్ డే-2023 పోస్ట్‌తో పొరపాటున బహిర్గతం చేశాడు.
Also Read: ICC Rankings: టెస్టుల్లోనూ నెంబర్‌వన్.. కెప్టెన్‌గా రోహిత్ సరికొత్త చరిత్ర
Also Read
- Nepal Floods: నేపాల్‌లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
- Bigg Boss Agnipariksha 2: బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
ఇంతకీ ఏం జరిగిందంటే.. టీమిండియా నయా స్టార్ శుభ్‌మన్ గిల్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారాతో డేటింగ్‌లో ఉన్నట్లు చాలాకాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే, ఈ విషయంపై మీడియా గిల్,సారాలను ఎన్ని సార్లు ప్రశ్నించినా స్పందించలేదు. ఇంతలో శుభ్‌మన్ డేటింగ్ చేస్తోంది.. సచిన్ కుమార్తె సారాతో కాదని, బాలీవుడ్ నవాబ్ సైఫ్ అలీ ఖాన్ ప్రియ తనయ సారా అలీ ఖాన్‌తో అని ప్రచారం మొదలైంది. శుభ్‌మన్-సారా అలీ ఖాన్ రిలేషన్‌ను కనుక్కునేందుకు అభిమానులు, మీడియా విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఎలాంటి క్లారిటీ దొరకలేదు. దీంతో శుభ్‌మన్ ఏ సారాతో రిలేషన్‌లో ఉన్నాడని తెలుసుకోలేక సచిన్, సైఫ్, శుభ్‌మన్, ఇరువురు సారాల అభిమానులు జట్టు పీక్కున్నారు. తాజాగా శుభ్‌మన్ సోషల్‌మీడియాలో చేసిన ఓ పోస్ట్ ద్వారా అభిమానులకు ఓ విషయంపై క్లారిటీ వచ్చింది. గిల్ తన 2023 వాలెంటైన్స్ డే పోస్ట్‌లో ఓ ఫోటో పోస్ట్ చేస్తూ.. What Day Is It Again? అని కామెంట్ జోడించాడు. ఈ పోస్ట్‌లో ఫోటోనే శుభ్‌మన్, సారా టెండూల్కర్ రిలేషన్‌ను బయటపెట్టింది.
ఈ ఫోటోలో గిల్.. ఓ రెస్టరెంట్‌లో కాఫీ తాగుతూ కనిపించాడు. గతంలో ఇదే ప్లేస్‌లో దిగిన ఫోటోను సారా సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఇరువురు పోస్ట్ చేసిన ఫోటోల్లో ఓ కామన్ పాయింట్ బట్టి చూస్తే.. గతంలో గిల్, సారా టెండూల్కర్ ఇద్దరు ఇదే ప్లేస్‌లో కలిసి కూర్చున్న విషయం స్పష్టమవుతుంది. దీని ఆధారంగా శుభ్‌మన్-సారా టెండూల్కర్‌తోనే రిలేషన్‌లో ఉన్నాడన్న విషయాన్ని అభిమానులు నిర్ధారించుకున్నారు. మరోపక్క ఇంకో ప్రచారం కూడా జరుగుతుంది. గిల్.. సారా డేటింగ్ చేసిన మాట వాస్తవమే అయినా వారిద్దరు ఇప్పుడు విడిపోయారని, వీరి రిలేషన్ బ్రేక్ అయ్యాక శుభ్‌మన్.. సారా అలీ ఖాన్‌తో ప్రేమాయణం సాగించాడని, ప్రస్తుతం సారా అలీ ఖాన్‌కు కూడా శుభ్‌మన్ బ్రేకప్ చెప్పాడని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. శుభ్‌మన్ వాలంటైన్స్ డే పోస్ట్ తర్వాత నెటిజన్లు మరో కొత్త విషయాన్ని ట్రోల్ చేస్తున్నారు. గిల్ ఇద్దరు సారాలతో డేటింగ్ చేసింది వాస్తవమే. అయితే గిల్.. సారాను మర్చిపోలుకపోతున్నాడు అంటూ ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకుంటున్నారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్‌లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
-
Bigg Boss Agnipariksha 2: బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
-
Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
-
Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
-
Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్‌కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!