Shraddha Das : మన్నారా చోప్రాతో గొడవపై స్పందించిన శ్రద్ధా దాస్.. వైరల్ అవుతున్న పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షో ఇప్పటి వరకు 16 సీజన్లు పూర్తి చేసుకుంది.ఈ రోజుతో 17వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. బిగ్ బాస్ సీజన్ 17 ఈ రోజు (జనవరి 28) ఫినాలే జరగనుంది. అయితే… ఈసారి కప్ కొట్టే రేసులో చివరి వరకు ఆరుగురు కంటెస్టెంట్స్ నిలిచారు. వీరిలో బాలీవుడ్ బ్యూటీ మన్నార్ చోప్రా కూడా ఉంది. తెలుగు మరియు హిందీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మన్నారా చోప్రా బాలీవుడ్ అగ్ర హీరోయిన్ ప్రియాంక చోప్రా కజిన్ అవుతుంది. సీజన్ 17 లో మన్నారా తన ఆటతీరుతో అందరినీ ఎంతగానో ఆకట్టుకుని ఫైనల్ 6లో చోటు సంపాదించుకుంది. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో మన్నారా చోప్రా పై ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.
టాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ కొద్ది రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మన్నారా చోప్రాతో తనకు మధ్య జరిగిన గొడవ గురించి చెప్పింది. ‘జిద్’ అనే మూవీలో ఈ ఇద్దరు కలిసి నటించారు. షూటింగ్ సమయంలో కొన్ని సన్నివేశాల్లో మన్నారా తనను నిజంగానే కొట్టిందని, ఆమె వల్ల గాయాలపాలయ్యానని చెబుతూ మన్నారా ప్రవర్తనపై శ్రద్ధా విమర్శలు చేసింది. అంతే కాదు… షూటింగ్ టైంలో మన్నారా ప్రవర్తనను తన సోదరీ ప్రియాంక చోప్రా కూడా సమర్థించిందని ఆ ఇంటర్వ్యూలో ఆమె పేర్కొంది. దీంతో శ్రద్ధా దాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. దీంతో ఇది కాస్త వివాదంగా మారింది.బిగ్ బాస్ 17 ఫినాలేకి ముందు శ్రద్ధా దాస్ తన ఇన్స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. “మన్నారా చోప్రాపై కానీ, ఆమె ఫ్యామిలీపై కానీ నేను ఏ మీడియా వ్యక్తికి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. కనీసం నేను పర్సనల్ పీఆర్వోని కూడా పెట్టుకోలేదు. నేను కావాలనుకుంటే ట్విట్టర్ లేక ఇన్స్టాగ్రామ్ లో వీడియో రిలీజ్ చేసి నాకు కావలసినంత పబ్లిసిటీని పొందుతాను. కానీ నేను అలాంటి పనులు చేయను. ఈ విషయంలో చాలా బాధ పడ్డాను. కానీ వీటన్నింటికీ నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను” అని తన పోస్ట్ లో పేర్కొంది. దీంతో శ్రద్ధా దాస్ పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారింది.
Also Read
- KTR: "రూ.1000 కోట్లు ఇస్తే మా ఆస్తులన్నీ ఇచ్చేస్తా".. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ఆఫర్.. ..
- Ponguleti Srinivasa Reddy: అసైన్డ్ భూములు లాక్కోం.. పట్టాదారులకు ఇబ్బంది ఉండదని మంత్రి స్పష్టం
- Dulquer Salmaan: వరుస తెలుగు సినిమాలతో రచ్చకు రెడీ అవుతున్న మాలీవుడ్ స్టార్ కిడ్..!
- Bank Holiday: బ్యాంకులకు మళ్లీ వరుస సెలవులు.. పూర్తి వివరాలు ఇవే

తాజావార్తలు
-
Abhishek Sharma: అంతర్జాతీయ క్రికెట్లోనే ఇదే మొదటిసారి.. అభిషేక్ రికార్డు బ్రేక్ కాదేమో ఇగ!
-
Agniveer Jobs 2026: అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు.. రిజర్వేషన్, రూల్స్ ఇవే
-
OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
-
KTR: “రూ.1000 కోట్లు ఇస్తే మా ఆస్తులన్నీ ఇచ్చేస్తా”.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ఆఫర్.. ..
-
IRUMUDI OTT : ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సెన్సషనల్ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’
ట్రెండింగ్
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?