Site icon NTV Telugu

Shocking Video: సమోస కొన్న తర్వాత ఫోన్ పే ట్రాన్సాక్షన్ ఫెయిల్.. కాలర్ పట్టుకుని ప్యాసింజర్‌ ను ఘోరంగా..!

Viral

Viral

Shocking Video: నేటి డిజిటల్ యుగంలో క్షణాల్లో సమాచారాన్ని ప్రపంచానికి చేరవేయడంలో సోషల్ మీడియా, వైరల్ వీడియోలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సామాజిక అన్యాయాలు, ఆసక్తికరమైన సంఘటనలు, ప్రజల ప్రవర్తనలోని మంచి చెడులను ఈ వీడియోలు బట్టబయలు చేస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక షాకింగ్ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో.. ఇప్పుడు రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది.

Don’t Trouble The Trouble : రాజమౌళి కొడుకు నిర్మాతగా ఫహద్ సినిమా మొదలు

ఇక అసలు విషయంలోకి వెళితే.. డిజిటల్ పేమెంట్ విఫలమవడంతో మధ్యప్రదేశ్ జబల్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఓ ప్రయాణికుడిపై సమోసా విక్రేత ఘోరంగా దాడి చేశాడు. ఈ షాకింగ్ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్టోబర్ 17 (శుక్రవారం) సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో జబల్‌పూర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నంబర్ 5 పై ఈ సంఘటన జరిగింది. సమాచారం ప్రకారం, రైలులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి సమోసా కొనుగోలు చేయడానికి రైలు దిగాడు. డబ్బులు చెల్లించేందుకు ఫోన్‌పే (PhonePe) యాప్ ద్వారా ప్రయత్నించగా, ట్రాన్సాక్షన్ విఫలమైంది.

Nara Lokesh Australia Tour: ఏపీ ఇండస్ట్రియల్ క్లస్టర్లలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించండి..

ఇంతలో తాను ఎక్కాల్సిన రైలు బయలుదేరడంతో, ఆ ప్రయాణికుడు సమోసాను తిరిగి ఇచ్చేసి రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహించిన సమోసా విక్రేత ప్రయాణికుడిని కాలర్ పట్టుకుని దారుణంగా లాగి తన డబ్బులు ఇవ్వాలంటూ పట్టుబట్టాడు. వైరల్ వీడియోలో ప్రయాణికుడు ఫోన్‌పే పేమెంట్ ఫెయిల్ అయిన విషయాన్ని విక్రేతకు వివరించేందుకు ప్రయత్నించినా.. అతను వినకుండా ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపించింది. చివరికి గొడవ సద్దుమణగడానికి ప్రయాణికుడు తన చేతికి ఉన్న స్మార్ట్‌వాచ్‌ను సమోసా విక్రేతకు ఇచ్చాడు. అప్పుడు విక్రేత రెండు సమోసాలు ఇచ్చి, రైలు ఎక్కేందుకు అనుమతించాడు. ఈ విక్రేత ప్రవర్తనపై ఇతర ప్రయాణికులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు రక్షణ లేదని, ఇలాంటి దాడులు షాకింగ్‌గా ఉన్నాయని కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version