Site icon NTV Telugu

Anantapur: దారుణ హత్య.. ఇంటర్ విద్యార్థినిని పెట్రోల్ పోసి కాల్చిన దుండగులు..!

Anantapur Student

Anantapur Student

Anantapur: అనంతపురం నగరంలో మరోసారి నరమానవత్వం కలవరపెట్టే ఘటన జరిగింది. ఇంటర్ సెకెండియర్ చదువుతున్న ఓ యువతి దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని దుండగులు విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి హత్యచేశారు. ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ అమానవీయ సంఘటన అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణిపాల్ స్కూల్ వెనుక భాగంలో చోటు చేసుకుంది. అక్కడ ఓ విద్యార్థినీ కాలిపోయిన మృతదేహం గుర్తించబడింది.

Read Also: Rinku Singh Engagement: ఘనంగా రింకూ – ప్రియా సరోజ ఎంగేజ్మెంట్.. కన్నీళ్లు పెట్టుకున్న ఎంపీ..!

మంగళవారం నుండి తమ కుమార్తె కనిపించట్లేదని ఆమె తల్లిదండ్రులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు స్పందించలేదని బాధితుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు పట్టించుకొని ఉంటే మా అమ్మాయి మాకు దక్కేది అంటూ కన్నీటి పర్యంతమైన విద్యార్థినీ తల్లి తన ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Robberies in Temples: గుడిలో జడ్జి మంగళసూత్రం దొంగతనం.. 10 మంది మహిళా దొంగల అరెస్టు..!

ఈ హత్యపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, విద్యార్థినీకి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. అనుమానితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.

Exit mobile version