టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ (Sharwanand) ఇప్పుడు రూటు మార్చారు. క్లాస్ సినిమాలతో మెప్పించే ఈ చామింగ్ స్టార్, ఇప్పుడు మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ పక్కా కమర్షియల్ యాక్షన్ డ్రామాతో వస్తున్నారు. మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పేరు ‘భోగి’ (BHOGI). శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంపత్ నంది మార్క్ యాక్షన్ అండ్ ఎమోషన్స్ ప్రధాన బలంగా నిలవనున్నాయి. అయితే తాజాగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో శర్వానంద్ మునుపెన్నడూ లేని విధంగా ఒక పవర్‌ఫుల్ అండ్ అగ్రెసివ్ లుక్‌లో కనిపిస్తున్నారు.
Also Read : Janhvi Kapoor :నీ గొంతు, నీ స్పర్శే నా బలం.. శ్రీదేవి వర్ధంతి వేళ జాన్వీ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
‘భోగి’ ఫస్ట్ లుక్ గనుక గమనిస్తే.. శర్వానంద్ మాస్ గెటప్‌లో, చేతిలో పదునైన ఆయుధం పట్టుకుని తీవ్రమైన ఆవేశంతో కనిపిస్తున్నారు. ఆయన మేకోవర్, ఆ గడ్డం, కళ్లలో ఇంటెన్సిటీ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఒక సాధారణ హీరోగా కాకుండా, ఈసారి కంప్లీట్ మాస్ యాక్షన్ హీరోగా శర్వానంద్ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. అంతే కాదు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటే సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించి డబుల్ ట్రీట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 28న భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. మొత్తనికి శర్వానంద్ కెరీర్‌లో ఇది ఒక బిగ్గెస్ట్ మాస్ హిట్ అవుతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
