తెలుగు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ పేరుకు పరిచయాలు అక్కర్లేదు.. అర్జున్ రెడ్డి స్టార్ తో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు.. ఆ సినిమాకు ఇప్పటికి క్రేజ్ తగ్గలేదు.. జనాలు ఇంకా ఆసక్తి చూపిస్తున్నారు.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకేక్కిన ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను కూడా మెప్పించింది.. దాంతో బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ చేశారు.. అక్కడ కూడా రికార్డులను బద్దలు కొట్టింది.. ఆ సినిమాలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ లు హీరో, హీరోయిన్లుగా నటించారు..
2019 లోప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ హిట్ ను సొంతం చేసుకోవడంతో పాటుగా ఏకంగా రూ.250 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసింది.. సందీప్ వంగ ఈ రెండు సినిమాలతో స్టార్ డైరెక్టర్ అయిపోవడమే కాదు బాలీవుడ్ లో భారీ ఆఫర్స్ దక్కించుకున్నాడు. అలాగే హీరో, హీరోయిన్లు కూడా ఈ సినిమాతో బాగా పాపులర్ అయ్యారు.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు..
తాజాగా ఈ ఇద్దరు హీరోలు ఒకే స్టేజ్ పై మెరిశారు.. మంగళవారం ముంబైలో అమెజాన్ ప్రైమ్ కంపెనీ తమ ఓటీటీలో రాబోయే సినిమాల గురించి ఓ ఈవెంట్ నిర్వహించగా అన్ని సినీ పరిశ్రమల నుంచి పలువురు సినీ సెలబ్రిటీలు ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ సందర్బంగా షాహిద్ కపూర్, విజయ్ దేవరకొండ ఇద్దరూ ఒకే స్టేజిపై కనిపించి అభిమానులకు ఆనందాన్ని ఇచ్చారు.. షాహిద్ కపూర్ మాట్లాడుతూ.. ఇతని వల్లే నాకు మంచి సినిమా ఆఫర్ వచ్చింది.. విజయ్ అర్జున్ రెడ్డి చేయకపోతే నా కబీర్ సింగ్ సినిమా లేదు అంటూ విజయ్ బుగ్గపై ముద్దు పెట్టాడు.. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.. ఇక విజయ్ నెక్స్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ కూడా అమెజాన్ ప్రైమ్ లోనే విడుదల కాబోతుంది..
#ShahidKapoor about how #VijayDeverakonda’s #ArjunReddy helped his Bollywood career and also about other movie
With proper scripts and directors @TheDeverakonda can make a significant difference in Indian cinema 🛐 pic.twitter.com/w5aHPI82Fk— Rohit Reddy (@FanDeverakonda) March 19, 2024