Site icon NTV Telugu

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ దాతృత్వం.. 1500 వరద బాధిత కుటుంబాలకు సాయం..

Shah Rukh Khan

Shah Rukh Khan

Shah Rukh Khan: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంజాబ్‌ అతాలకుతలమైంది. భారీ వరదలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. పలువురు చనిపోగా, వేలాది కుటుంబాలు నడిరోడ్డున పడ్డాయి. భారీ ఎత్తున ప్రజలు జీవనోపాధి కోల్పోయారు. పెద్ద సంఖ్యలో పశువులు మరణించాయి. వరదలతో పంజాబ్‌లో జనజీవనం అస్తవ్యస్తమైంది. వేలాది మంది తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఈ సంక్షోభం మధ్య, బాలీవుడ్ నటులు పెద్ద మనసు చాటుకున్నాడు. బాధితులకు సాయం చేసేందుకు నటుడు షారుఖ్ ఖాన్ మీర్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. స్థానిక స్వచ్ఛంద సంస్థలతో కలిసి పంజాబ్ వరదల బాధిత కుటుంబాలకు సహాయం చేస్తోంది.

READ MORE: కొత్త బైక్ లేదా స్కూటర్ కొనాలనేవారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న Honda వాహనాల ధరలు!

మీర్ ఫౌండేషన్ కింద.. పంజాబ్ వరద బాధితులకు అవసరమైన సహాయ కిట్లను పంపిణీ చేస్తున్నారు. వీటిలో మందులు, పరిశుభ్రత వస్తువులు, ఆహార పదార్థాలు, దోమతెరలు, టార్పాలిన్ షీట్లు, మడతపెట్టే పడకలు, కాటన్ పరుపులు, ఇతర ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి. అమృత్సర్, పాటియాలా, ఫాజిల్కా, ఫిరోజ్‌పూర్ వంటి జిల్లాల్లోని మొత్తం 1,500 కుటుంబాలను ఈ సాయం అందుతోంది. ప్రజల తక్షణ ఆరోగ్యం, భద్రత, ఆశ్రయ అవసరాలను తీర్చడానికి సంస్థ కృషి చేస్తోంది. దేవుడు మీ అందరికీ తోడుగా ఉంటాడని షారుక్‌ ఖాన్ ట్వీట్ చేశారు.

READ MORE: Kurnool : 8 నెలల చిన్నారిని నీటి డ్రమ్ములో ముంచి చం*పేసిన కసాయి తండ్రి

Exit mobile version