Site icon NTV Telugu

Heavy Rains: అకాల వర్షాలతో తీవ్ర నష్టం.. మరో రెండు రోజులు భారీ వర్షాలు..!

Telanganarains

Telanganarains

Heavy Rains: అకాల వర్షాలు ఏపీలోని పలు ప్రాంతాల్లో చేతికి వచ్చిన పంటను ధ్వంసం చేశాయి.. ఈదురుగాలులతో మొదలైన వర్షం.. గంటన్నరపాటు బీభత్సం సృష్టించింది.. నిన్న కురిసిన అకాల వర్షం.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పంటలకు పట్టిన పూట పగిలినట్టైంది. చేతికి వచ్చే పరిస్థితిలో ఉన్న పంటలు ఒక్కసారిగా వానకు గురై రైతుల కలలను కరిగింపజేశాయి. మొక్కజొన్న, మామిడి, వరి పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. పంటలను ఎండబెట్టి మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధంగా ఉన్న రైతుల ఆశలపై వర్షం నీళ్లు చల్లింది. కల్లంలో కాట వేసిన ధాన్యాన్ని అధికారులు ఇప్పటివరకు తీసుకోకపోవడంతో, ఆ ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఇప్పటికే నష్టపోయిన రైతులకు ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని మరోచోటికి తరలించే ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు, కూలీల వ్యయాలు కూడా భారంగా మారాయి. ఇప్పటి వరకూ ఒక్క అధికారి కూడా వచ్చి మా పరిస్థితి చూడలేదు.. మా దయనీయం ఆయన పరిస్థితిని చూసి ప్రభుత్వం మమల్ని ఆదుకోవాలి అని రైతులు వేడుకుంటున్నారు..

Read Also: Babil Khan : బాబిల్ ఖాన్ పోస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన టాలీవుడ్ డైరెక్టర్..

ఇక, తిరుపతి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఈ అకాల వర్షం విధ్వంసం సృష్టించిందిన.. ఈదురుగాలుల ధాటికి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.. చిత్తూరు నగరంలో భారీ వర్షం కురిసింది. బాపట్ల జిల్లా నిజాంపట్నం, చీరాల, బాపట్ల, రేపల్లె, చినగంజాంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వందల స్తంభాలు నేలకూలాయి.. ఈ విధ్వంసాన్ని మరువక ముందే.. మరో రెండు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.. పశ్చిమ బెంగాల్‌ నుంచి ఒడిశా తీరం మీదుగా ఉత్తర కోస్తా వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా.. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఈ రోజు కొన్ని చోట్ల.. రేపు పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది వాతావరణశాఖ..

Exit mobile version