Site icon NTV Telugu

Surya Grahan 2025: మరో 14 రోజుల్లో ఇంకో గ్రహణం.. ఈ నాలుగు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే..!

Surya

Surya

Surya Grahanam: హిందూ సంప్రదాయం ప్రకారం గ్రహణాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. సాధారణంగా సూర్య గ్రహణం, చంద్రగ్రహణం వేర్వేరు నెలల్లో వస్తుంటాయి. కానీ, ఈసారి మాత్రం ఒకే నెలలో రెండు గ్రహణాలు రావడంతో వాటి ప్రభావం అధికంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. అయితే, హిందూ శాస్త్రాల ప్రకారం ఈ గ్రహణాలను అశుభకరంగా భావిస్తారు. ఈ క్రమంలో, ఈ ఏడాదిలో రెండో పాక్షిక సూర్యగ్రహణం సెప్టెంబర్ 21వ తేదీన రాబోతుంది. కాగా, ఈ గ్రహణం ఎఫెక్ట్ భారత్‌లో మాత్రం ఉండదు. అందువల్ల మన దేశంలో సూతక కాలం వర్తించదు అన్నమాట. చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా కప్పేయడంతో సూర్యకాంతి కొంతమేర తగ్గిపోతుంది.

Read Also: Tollywood : నటి సుధపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్ట్ లు.. పంజాగుట్ట పోలీస్ లో కేసు నమోదు

కాగా, ఈ సూర్యగ్రహణం సెప్టెంబర్ 21న రాత్రి 10:59 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 22వ తేదీ తెల్లవారుజామున 3:23 గంటల వరకు కొనసాగనుంది. ఇది ఈ ఏడాదిలో చివరి సూర్యగ్రహణం అని చెప్పాలి. ఇక, 2027 ఆగస్టు 2వ తేదీన సంభవించే సూర్యగ్రహణం ఈ దశాబ్దంలోనే అతి పెద్దది అని చెప్పాలి. ఆ తర్వాత 2114వ ఏడాదిలో ఇలాంటి గ్రహణం సంభవించే అవకాశం ఉంది. అయితే, 2025 సెప్టెంబర్ 21న ఏర్పడే ఈ పాక్షిక సూర్యగ్రహణం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, అట్లాంటిక్ మహాసముద్రం, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం లాంటి ప్రాంతాల్లోనే కనిపిస్తుంది. సూర్యుడి నుంచి వెలువడే యూవీ కిరణాలు కళ్లకు హానికరం.. కాబట్టి ఈ గ్రహణాన్ని నేరుగా చూడొద్దని నిపుణులు పేర్కొంటున్నారు. టెలిస్కోప్‌లు, బైనాక్యులర్లు లేదా ఆఫ్టికల్ పరికరాల సాయంతో చూడాలని సూచిస్తున్నారు.

Read Also: Viral: యువత తగ్గిపోతుండటంతో.. ఇండియా వైపు కన్నేసిన జపాన్..

అయితే, గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన చేయడం మంచిదని పెద్దలు తెలియజేస్తున్నారు. సాధారణంగా సూర్యగ్రహణానికి 12 గంటల ముందు సూత కాలం స్టార్ట్ అవుతుంది. కానీ, ఇది గ్రహణం కనిపించే ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి భారత్‌లో ఈ సూర్యగ్రహణం కనిపించకపోవడంతో సూత కాలం కూడా వర్తించదు. అయితే, ఈ గ్రహణం ప్రభావం ముఖ్యంగా నాలుగు రాశులపై ఉంది. మిథునం, కన్యారాశి, ధనుస్సు రాశి, మీనా రాశిలపై దీని ఎఫెక్ట్ ఉండనుంది.

Read Also: Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

కన్యారాశి
కన్యారాశి వారు సూర్యగ్రహణం కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఉద్యోగులు, వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. కన్యా రాశి వారు ఆర్థికపరమైన విషయాలలోనూ కొద్దీగా అప్రమత్తంగా ఉండే మంచిది. అలాగే, ఆరోగ్య పరంగాను వీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. ఈ గ్రహణ సమయంలో చాలా నష్టాలను చూడాల్సి వస్తుంది.. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో అస్సలు తొందరపడకుండా జాగ్రత్త పడాలి.

మిథున రాశి
మిథున రాశి వారికి సూర్యగ్రహణం వల్ల తీవ్ర సమస్యలు వస్తాయి. ఈ సమయంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏ పని చేసిన అడ్డంకులు వస్తాయి.. డబ్బుల విషయంలో మోసపోయే అవకాశం కూడా ఉంది.. అలాగే, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా బలహీనంగా పడే ప్రమాదం ఉంది. కాబట్టి మిథునరాశి వారు గ్రహణం రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశివారు సూర్యగ్రహణంతో ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో సమస్యలు వస్తాయి.. చేసే పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు నష్టాలను చవిచూస్తారు. ఈ గ్రహణ సమయంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సూర్యగ్రహణం ఉన్నప్పుడు పెట్టుబడులు పెడితే ఇది వీరికి చాలా కష్టాలను తెచ్చే అవకాశం ఉంటుంది.

మీనరాశి
మీనరాశి వారు సూర్యగ్రహణం వల్ల అనేక ఇబ్బందులు పడతారు. ఈ సమయంలో మీన రాశి వారికి ఏ పని చేసిన ప్రతికూల ఫలితాలే లభిస్తాయి. ఆర్థికపరంగా పలు సమస్యలు ఎదురవుతాయి. పెట్టుబడులు పెట్టే విషయంలో నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది. పోలీస్ కేసుల్లో చిక్కుకుంటారు.. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

ఈ వార్త వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో దొరికిన సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనికి ఎన్డీవీ తెలుగు. కామ్ కి ఎలాంటి సంబంధం లేదు..

Exit mobile version