Site icon NTV Telugu

Sivaji Raja: నటుడు శివాజీ రాజా ఇంట్లో తీవ్ర విషాదం.. అనారోగ్యంతో తండ్రి కన్నుమూత!

Shivaji Raja

Shivaji Raja

టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి జి. రామరాజు (85) మంగళవారం ఉదయం 8 గంటలకు మధురానగర్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం కన్నుమూశారు. తండ్రి మరణంతో శివాజీ రాజా కుటుంబం పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది.

Also Read: Nayanthara : యష్ కోసం తగ్గిన లేడీ సూపర్‌స్టార్.. టాక్సిక్ పారితోషికం లీక్!

రామరాజు భౌతికకాయాన్ని సందర్శనార్థం వారి నివాసంలో ఉంచారు. అంత్యక్రియల వివరాల ప్రకారం.. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల లోపు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శివాజీ రాజా తండ్రి మరణవార్త తెలిసిన వెంటనే పలువురు సినీ నటులు, నిర్మాతలు రాజకీయ ప్రముఖులు ఆయనకు ఫోన్ ద్వారా,సోషల్ మీడియా వేదికగా తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. శివాజీ రాజా ప్రస్తుతం తన తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించే పనుల్లో నిమగ్నమై ఉన్నారు.

Exit mobile version