NTV Telugu Site icon

Sean Bean : షాన్ బీన్ ఐదో భార్యకు అది బాగా నచ్చిందట!

Knights Of The Zodiac

Knights Of The Zodiac

Sean Bean : హాలీవుడ్ లో విలక్షణ నటునిగా గుర్తింపు పొందిన షాన్ బీన్ ఏప్రిల్ 17న 64 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. హాలీవుడ్ లో యాభై ఏళ్ళు దాటాకే అసలైన కెరీర్ ఆరంభమవుతుందనే సామెత ఉంది. అందువల్ల తన జీవితంలో ఇంకా ఎంతో సమయం నటన కోసం వేచి ఉందని షాన్ బీన్ అంటున్నారు. షాన్ బీన్ పేరు వినగానే ఆయన నటించిన క్లాసికల్ మూవీస్ ముందుగా గుర్తుకు వస్తాయి. “జాకబ్, ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్, ట్రాయ్” వంటి చిత్రాలలో షాన్ అభినయం అందరినీ అలరించింది. 2011లో జనం ముందు నిలచిన సంచలన వెబ్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రాన్స్’లో ఎడార్డ్ నెడ్ స్టార్క్ పాత్రలోనూ ఆయన నటన మురిపించింది. ఇవి కాకుండా అనేక సాంఘిక చిత్రాలలోనూ, టీవీ సీరిస్ లోనూ షాన్ బీన్ తనదైన నటనతో జనాన్ని ఆకట్టుకున్నారు. ఈ యేడాది విడుదలైన ‘మమ్మీస్’ చిత్రంలో ఫరో పాత్రకు వాయిస్ అందించారు షాన్ బీన్. ఆయన నటించిన తాజా చిత్రం ‘నైట్స్ ఆఫ్ ద జోడియాక్’ ఏప్రిల్ 28న విడుదల కానుంది.

Read Also: Anup Rubens : భలేగా సాగుతున్న అనూప్ రూబెన్స్!

‘నైట్స్ ఆఫ్ జోడియాక్’లో అల్మాన్ కిడ్డో అనే పాత్రను షాన్ బీన్ పోషించారు. ఈ పాత్ర తనకెంతో సంతృప్తినిచ్చిందని, ఇలాంటి వైవిధ్యమైన పాత్రలు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నానని షాన్ అంటున్నారు. జపాన్, అమెరికా సంయుక్తంగా ‘నైట్స్ ఆఫ్ జోడియాక్’ చిత్రాన్ని నిర్మించాయి. అమెరికాలో ఈ సినిమా మే 12న జనం ముందు నిలువనుంది. ఇటు ఆసియా, అటు అమెరికా ఖండాల్లోని సినీఫ్యాన్స్ అందరికీ ‘నైట్స్ ఆఫ్ జోడియాక్’ ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుందని షాన్ బీన్ చెబుతున్నారు. ఇప్పటికి ఐదు పెళ్ళిళ్ళు చేసుకున్న షాన్ బీన్ నలుగురికి విడాకులు ఇచ్చారు. ప్రస్తుతం ఆయన భార్య యాష్లే మూర్. తన భార్యకు ఇందులోని తన పాత్ర ఎంతగానో నచ్చిందని, అందువల్లే సినిమా సైతం అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉందని షాన్ బీన్ అంటున్నారు. మరి ‘నైట్స్ ఆఫ్ జోడియాక్’లో అల్మాన్ కిడ్డో పాత్రలో ఏ తీరున షాన్ బీన్ మెప్పిస్తారో చూడాలి.

Show comments