Palnadu: పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కలకలం సృష్టిస్తుంది. స్క్రబ్ టైఫస్ లక్షణాలతో ఇద్దరు మృతి చెందారు. ముప్పాళ్ల మండలం రుద్రవరానికి చెందిన ఇంటర్ విద్యార్థిని జ్యోతి జ్వరం, ఒంటినొప్పులతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇరవై రోజుల క్రితం మృతి చెందింది. రాజుపాలెం ఆర్.ఆర్. సెంటర్‌కు చెందిన వృద్ధురాలు నాగమ్మ కూడా జ్వరంతో చికిత్స పొందుతూ ఇరవై రోజుల క్రితం మృతి చెందింది. మరోవైపు.. రాజుపాలెం మండలం కొత్తూరుకు చెందిన మరో వృద్ధురాలు సాలమ్మ కూడా స్క్రబ్ టైఫస్ లక్షణాలతో ప్రస్తుతం చికిత్స పొందుతోంది. అయితే.. చనిపోయిన ఇద్దరి శాంపిల్స్ టెస్టుల కోసం ముంబై పంపించారు. పరీక్షల్లో స్క్రబ్ టైఫస్‌తో మృతిచెందినట్లు రిపోర్టుల్లో తేలినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే అధికారులు మాత్రం రిపోర్టుల వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు.
READ MORE: Shocking : చాంద్రాయణగుట్టలో కలకలం.. ఓ ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు
స్క్రబ్ టైఫస్ కీటకాల తాకిడి ఆగస్టు నుంచి ఫిబ్రవరి మధ్య ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మనుషుల నుంచి మనుషులకు ఈ ఇన్‌ఫెక్షన్ సోకకపోయినా, కీటకం కాటుకు గురైన వ్యక్తి అస్వస్థతకు గురవుతారు. అందుకే తగిన జాగ్రత్తలు తప్పనిసరి అని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అందుకే.. తడి నేలలు, పొదలు, తోటలు, పొలాలు, పశువుల పాకలు, వ్యర్థాలు పోగుచేసే ప్రాంతాల్లో పనిచేసే వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలి. పూర్తి చేతులున్న చొక్కా, ప్యాంట్లు, కాలికి సాక్సులు, బూట్లు ధరించాలి. ఇళ్లలో పాత మంచాలు, పరుపులు, దిండ్లలోకి ఈ కీటకాలు చొరబడే అవకాశం ఉన్నందున వాటిని మార్చాలి. లేదంటే శుభ్రం చేశాకే వాడాలి.పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందున, కాళ్లు, చేతులు కప్పి ఉంచేలా దుస్తులు వేసి, జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు వెల్లడించారు.
READ MORE: Rohit Sharma Historic Milestone: 41 పరుగులే.. దిగ్గజాలు సచిన్, ద్రవిడ్ సరసన రోహిత్ శర్మ!
