Site icon NTV Telugu

SBI Recruitment 2023: ఎస్బీఐలో ఉద్యోగాలు..6160 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

Sbi

Sbi

ప్రముఖ దేశీయ బ్యాంక్ ఎస్బీఐ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. పలు శాఖల్లో ఖాళీలు ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. నోటిఫికేషన్ ప్రకారం.. 6160 అప్రెంటీస్‌ ఖాళీలను భర్తీ చేయనుంది.. సెప్టెంబర్ 01 నుండి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది.. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 21, 2023న ముగుస్తుంది. దరఖాస్తుల సమయం దగ్గర పడుతున్న వేళ.. ఇంకా ఎవరైనా అప్లికేషన్ చేసుకోకపోతే.. అధికారిక వెబ్ సైట్ ద్వారా చేసుకోండి. అభ్యర్థులు SBI అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ వివరాలను, సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్ sbi.co.inనుండి తనిఖీ చేయవచ్చు. అక్టోబర్ లేదా నవంబర్ 2023లో.. SBI అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్‌కు ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది..

అర్హతలు..

అర్హత పొందిన గ్రాడ్యుయేటింగ్ డిగ్రీని కలిగి ఉంటే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకుకోవాలనుకునే అభ్య ర్థుల యొక్క వయోపరిమితి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్ డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది..

అప్లికేషన్ ఫీజు..

జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి దరఖాస్తు రుసుము రూ. 300. SC/ST/PwBD కేటగిరీల అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు..

ఎలా అప్లై చేసుకోవాలంటే?

ముందుగా SBI అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.

రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్చేయండి..

లింక్‌లో SBI అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2023 అనే ఆప్షన్ కు వెళ్లండి.

ఇక్కడ లింక్‌ని ఎంచుకోండి..

ఇక్కడ మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేయండి.

ఫీజు చెల్లించి.. దరఖాస్తు ఫారమ్ ను సమర్పించండి…

అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకొని.. ప్రింట్ అవుట్ తీసుకోండి…
ఇంటర్వ్యూ ప్రక్రియ..

అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష 60 నిమిషాలు ఉంటుంది. ప్రశ్నపత్రం నాలుగు విభాగాలను కలిగి ఉంటుంది. జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మరియు రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్. ప్రతి విభాగానికి.. అభ్యర్థులకు 15 నిమిషాల వ్యవధి కేటాయించబడుతుంది. SBI పరీక్షలోని ప్రతి విభాగంలో 1 మార్కు చొప్పున 25 ప్రశ్నలు ఉంటాయి…

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 21, 2023

రాత పరీక్ష: అక్టోబర్/నవంబర్ 2023..

ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవాళ్ళు నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు..

Exit mobile version