Saudi Arabia Military Support: ఆఫ్ఘన్ రాజధాని కాబుల్‌లో పాక్ దాడి చేసిన విషయం తెలిసిందే. దాయాది దాడికి ప్రతీకారంగా శనివారం రాత్రి ఆఫ్ఘన్ దాడి చేసి 58 మంది పాకిస్థా న్ సైనికులను చంపింది. తాజా పరిస్థితులు ఇరు దేశాల మధ్య పరిస్థితిని మరింత దిగజార్చాయి. ప్రస్తుతం పాక్ – తాలిబన్ల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణల నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకునే అవకాశం ఏమైనా ఉందా అనే అంశంపై ప్రపంచం ఆసక్తిగా గమనిస్తుంది.
READ ALSO: Rishab Shetty : జై హనుమాన్ సినిమాపై రిషబ్ క్లారిటీ.. రెండేళ్లు అంటూ..
సౌదీ అరేబియాపై ప్రపంచం దృష్టి..
పాక్- తాలిబన్ల మధ్య ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్న కారణంగా ఇప్పుడు ప్రపంచం చూపు సౌదీ వైపు మళ్లింది. ఆఫ్ఘన్- పాక్‌పై దాడి చేయడంతో.. ఈ దాడికి ప్రతిస్పందనగా సౌదీ అరేబియా ఎలాంటి చర్య తీసుకుంటుందనేది ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇటీవల సౌదీ అరేబియా – పాకిస్థాన్ మధ్య ఒక రక్షణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. దీని ప్రకారం పాక్ పై జరిగే ఏదైనా దాడిని తమ దేశంపై జరిగిన దాడిగా పరిగణిస్తామని సౌదీ అరేబియా పేర్కొంది. ఈ ఒప్పందంలో ఒక దేశంపై దాడి జరిగితే, మరొక దేశం సహాయం అందిస్తుందని పేర్కొన్నారు.
దాడిపై సౌదీ స్పందన ఏంటి..
ఇప్పటి వరకు పాక్-తాలిబన్ల ఘర్షణలపై రియాద్.. రెండు దేశాలు సంయమనం పాటించాలని బహిరంగంగా పిలుపునిచ్చింది, ఉద్రిక్తతలు పెరగకుండా చూసుకోవాలని, ఇరుదేశాలు సంభాషణలతో సమస్యలు పరిష్కరించుకోడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది. అయితే సౌదీ అరేబియా- పాక్ మధ్య ఉన్న ఒప్పందం కారణంగా దాయాదికి సౌదీ వ్యూహాత్మక మిత్రదేశంగా చెప్పవచ్చు. సౌదీ అధికారులు ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్థాన్‌లో ఎటువంటి ప్రత్యక్ష సైనిక జోక్యాన్ని ప్రకటించనప్పటికీ, వివాదం తీవ్రమైతే మాత్రం సౌదీ అరేబియా పాక్‌కు మద్దతు ఇవ్వాల్సి రావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే గతంలో ఇరుదేశాలు చేసుకున్న ఒప్పందంలో.. ఈ రక్షణ విషయం స్పష్టంగా ఉంది.
యుద్ధంలోకి సౌదీ అరేబియా ప్రవేశిస్తుందా?
ఉద్రిక్తతలను తగ్గించడానికి, ఈ ప్రాంతంలో భద్రత, స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ఇరుదేశాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ బహిరంగంగా పేర్కొంది. ఇది సౌదీ విదేశాంగ విధానంలో మార్పును కూడా సూచిస్తుంది. ఇక్కడ సౌదీ అరేబియా దక్షిణ, మధ్య ఆసియా వంటి అస్థిర ప్రాంతాలలో తన భాగస్వాములను రక్షించడంలో మరింత చురుకైన పాత్రను పోషిస్తున్నట్లు సూచిస్తోంది. ప్రస్తుతం సౌదీ అరేబియా సంయమనం, దౌత్యం కోసం విజ్ఞప్తి చేస్తోంది. కానీ రక్షణ ఒప్పందం, పెరుగుతున్న సరిహద్దు వివాదం ఉద్రిక్తతలు మరింత పెరిగితే, సౌదీ అరేబియా పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వవచ్చని నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
పాక్‌లో ఆఫ్ఘన్ విధ్వంసం..
పాకిస్థాన్‌లో శనివారం రాత్రి ఆఫ్ఘన్ ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. డ్యూరాండ్ లైన్ సమీపంలోని అనేక పాకిస్థాన్ సరిహద్దు పోస్టులపై ఆఫ్ఘనిస్థాన్ షెల్ దాడి చేసింది. ఆఫ్ఘన్ నివేదికల ప్రకారం.. ఈ కాల్పుల్లో పాక్ భారీ నష్టాలను చవిచూసిందని తెలిపింది. తాలిబాన్ ప్రభుత్వ ప్రధాన ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. ఆఫ్ఘన్ దళాలు 25 పాకిస్థాన్ ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నాయని, ఈ ఆపరేషన్‌లో 58 మంది పాక్ సైనికులు మరణించారని, సుమారుగా 30 మంది గాయపడ్డారని చెప్పారు. ఏడుగురు పాక్ సైనికులను బందీలుగా చేసుకున్నట్లు వెల్లడించారు. ఆఫ్ఘన్ ప్రభుత్వం బందీల ఫోటోలను కూడా పంచుకుంది.
READ ALSO: Mamata Banerjee: “అమ్మాయిలు రాత్రి బయటకు రాకూడదు”.. గ్యాంగ్‌రేప్‌పై మమత వివాదం..
