NTV Telugu Site icon

Koneti Adimulam: టీడీపీ నుంచి సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం సన్పెన్షన్‌

Koneti Adimulam

Koneti Adimulam

Koneti Adimulam: టీడీపీ అధిష్టానం సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సన్పెన్షన్‌ చేసింది. ఎమ్మెల్యే ఆదిమూలంను టీడీపీ అధిష్టానం సస్పెండ్‌ చేస్తూ ప్రకటన వెల్లడించింది. ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలతో చర్యలు చేపట్టింది టీడీపీ అధిష్టానం. దీంతో ఏపీ రాజకీయాల్లో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం సన్పెన్షన్‌ సంచలనంగా మారింది. తనను బెదిరించి 3 సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధిత మహిళ టీడీపీ అధిష్టానానికి లేఖ రాసింది.

Read also: Medicines Prescription: ఇదేందయ్యా ఇది.. ఇలాంటి ప్రిస్క్రిప్షన్‌ ఎప్పుడు చూడలే..

ఇద్దరం కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నామని, పార్టీ కార్యక్రమాల్లో పరిచయమై నా ఫోన్‌ నెంబర్‌ తీసుకున్నాడని పేర్కొంది బాధిత మహిళ. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నాకు పదేపదే ఫోన్‌ చేసేవాడని బాధిత మహిళ తెలిపింది. లైంగిక కోరిక తీర్చకుంటే కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేసింది బాధిత మహిళ. ఆదిమూలం గురించి అందరికీ తెలియాలని పెన్‌ కెమెరా పెట్టుకున్నానని.. ఎమ్మెల్యే తనపై చేసిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియోలను టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లింది బాధిత మహిళ.. దీంతో.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది టీడీపీ అధిష్టానం.

Tamannaah Bhatia : పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న తమన్నా.. ఆ అందం చూడవయా !

Show comments