NTV Telugu Site icon

Saree Walkathon : సూరత్ లో ‘శారీ వాకథాన్’.. చీరలో ముద్దుగా ముద్దుగుమ్మలు

Saree Walkathon

Saree Walkathon

Saree Walkathon : భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినల్లు. దేశంలోని మహిళల వస్త్రధారణలో చీరకున్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చీరలో మహిళల అందం మరింత పెరుగుతుంది. చీర కట్టు వారికి హుందాతనాన్ని తెస్తుంది. పండుగలకు, పెళ్లిళ్లలో చాలామంది స్త్రీలు పలురకాల చీరలు కట్టుకుని సందడి చేస్తుంటారు. అయితే 15000 మంది మహిళలు ఒకేసారి, ఒకేచోట చీరకట్టుతో కనిపిస్తే? ఆహా కనులకు కనువిందుగా ఉంటుంది కదూ.. సూరత్ లో జరిగిన “శారీ వాకథాన్” అందుకు వేదిక అయ్యింది. మహిళా సాధికారత, మహిళల్లో ఫిట్ నెస్‌పై అవగాహన కల్పించడం కోసం సూరత్ మున్సిపాలిటీ, సూరత్ స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్ లిమిటెడ్ ఈరోజు శారీ వాకథాన్ అనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టింది.

Read Also: Ashika Ranganath: ఈ బ్యూటీ బాగానే ఉంది కానీ సాలిడ్ బ్రేక్ రాలేదు…

ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో 15000 మంది మహిళలు చీరలు కట్టుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి డ్యాన్స్‌లు, పాటలతో వేడుకను హోరెత్తించారు. ఈ వాకథాన్ పోలీసు పరేడ్ గ్రౌండ్ నుండి ప్రారంభమై పార్లే పాయింట్ వంతెన దగ్గర వరకు సాగి మళ్లీ పోలీస్ పరేడ్ గ్రౌండ్ కు చేరుకుంది. ఇక ఈరోజు ఉమ్రా పార్టీకి సంబంధించిన ప్లాట్ లో సూరత్ మున్సిపాలిటీ చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసింది. ఇండియాలోనే ఇంత పెద్ద “శారీ వాకథాన్” నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 13,900 మంది మహిళలు రిజిస్టర్ చేసుకున్నారు. విదేశాల నుంచి సూరత్ ‌‌కు వచ్చిన వారు సైతం ఈ వాకథాన్‌‌కి వచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దర్శన జర్దోష్, సీఆర్ పాటిల్, హర్ష్ సంఘ్వీ పాల్గొన్నారు.

Show comments