NTV Telugu Site icon

Sara Tendulkar: ట్రెడిషనల్ డ్రెస్సులో సచిన్ కూతురు ఎంత అందంగా ఉందో చూశారా?

Saraaa

Saraaa

భారత మాజీ క్రికెట్​ దిగ్గజం సచిన్​ టెండూల్కర్​ కూతురు సారా టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సచిన్ తన ఆటతో అందరి మనసులు కొల్లగొడితే.. సారా తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది.. ఎప్పుడూ ఏదొక వార్తతో వార్తల్లో నిలుస్తుంది.. లండన్ కాలేజ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివిన సారా.. సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబందించిన పోటోలను ఎప్పటికప్పుడూ షేర్‌ చేస్తూ.. అభిమానులకు టచ్‌లో ఉంటుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

దేశం వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి.. ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ నివాసం యాంటిలియాలో మంగళవారం గణపతి పూజ నిర్వహించారు.. గణపతి పూజలో అంబానీ కుటుంబ సభ్యులతో పాటు సినీ పరిశ్రమతో పాటు క్రీడారంగానికి చెందిన ప్రముఖులు కుటుంబ సభ్యులతో హాజరై విఘ్నేశ్వరుడి దర్శించుకున్నారు. బాలీవుడ్ బాద్షా షారూక్‌ఖాన్ తన భార్య, పిల్లలతో అంబానీ నివాసంలో జరిగిన గణపతి పూజలో పాల్గొన్నారు. అటు లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన సతీమణి, పిల్లలతో కలిసి వచ్చారు.. ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

అంబానీ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా జరిపిన గణేష్‌ పూజకు టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. గణేష్ చతుర్థి వేడుకల్లో పాల్గొని విఘ్నేశ్వరుడ్ని దర్శించుకున్నారు.. ఈ పూజకు సారా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది.. గ్రీన్ కలర్ డ్రెస్సులో మెస్మరైజ్ చేసింది.. అక్కడున్న కెమెరాలను తనవైపు తిప్పుకుంది.. అమ్మడు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.. దీంతో ఆ వీడియోలపై సచిన్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నాయి.. చాలా అందంగా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు..