Sanyuktha Menon: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ సినిమా ‘అఖండ 2 తాండవం’. ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అభిమానుల్లో అంచనాలను భారీ స్థాయిలో పెంచాయి. ‘అఖండ 2: తాండవం’ 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సంయుక్త మీనన్ ఒక ఇంటర్వ్యూలో సినిమా గురించి పలు ఆసక్తికరమైన సంగతులు పంచుకున్నారు.
READ ALSO: Oppo A6x 5G: ఒప్పో A6x 5G విడుదల.. 6,500mAh బ్యాటరీ.. బడ్జెట్ ధరలోనే
హీరోయిన్ సంయుక్త మాట్లాడుతూ.. ‘ముందుగా డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ కథ గురించి చెప్పారు. ఫస్ట్ డేట్స్ ఉన్నాయో లేదో మా టీంని అడిగాను, వాళ్లు లేవని చెప్పారు. అప్పుడు ఎలాగైనా ఈ సినిమా చెప్తే వాళ్లు డేట్స్ అడ్జస్ట్ చేశారు. ఈ సినిమా డైరెక్టర్ గ్రేట్ విజన్‌తో తీశారు. మన ఇమాజినేషన్ కి మించి ఉంటుంది’ అని అన్నారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ.. వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్స్‌లో చాలా కీలకంగా ఉంటుందని వెల్లడించారు. చిత్రంలో తన క్యారెక్టర్ స్టయిలీష్‌గా ఉంటుందని వెల్లడించారు. అయితే సినిమాలో సాంగ్ చేయాలని చెప్పారని, ఆ పాట విన్న తర్వాత తనకు చాలా నెర్వస్‌గా అనిపించిందని అన్నారు. ఎందుకంటే అంత మాస్ సాంగ్ తన సినీ కెరీర్‌లో ఎప్పుడు చేయలేదని అన్నారు. కానీ తప్పకుండా సాంగ్‌ను అద్భుతంగా చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రెండు రోజులు ప్రాక్టీస్ తర్వాత కూడా తన మోకాలు సహకరించలేదని, కానీ తర్వాత ఫిజియోథెరపీ తీసుకొని ఈ సాంగ్‌ను కంప్లీట్ చేసినట్లు వెల్లడించారు. థియేటర్స్‌కి ఆడియన్స్ వచ్చిన తర్వాత వాళ్లని ఎంటర్టైన్ చేయాలనేది తన ఫైనల్ గోల్ అని అన్నారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ చాలా స్టైలిష్ గా ఉంటుందని చెప్పారు.
READ ALSO: Akhanda 2 : అఖండ 2 టిక్కెట్ల ధరల పెంపునకు ఏపీ సర్కార్ ఓకే.. ఎంత పెంచారంటే !
