Site icon NTV Telugu

Naari Naari Naduma Murari : పెద్ద సినిమాల నడుమ శర్వా సినిమా.. అయ్యే పనేనా?

Naari Naari

Naari Naari

సంక్రాంతి తెలుగు సినిమాలకు ఒక పెద్ద సీజన్. ఆ సమయంలో మూడు, నాలుగు సినిమాలను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. బావుంటే అవన్నీ కూడా హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే, ఇప్పటికే తెలుగులో రెండు పెద్ద సినిమాలు సంక్రాంతికి కర్చీఫ్ వేసుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారి సినిమాతో పాటుగా, ప్రభాస్ రాజా సాబ్ సినిమా ఇప్పటికే సంక్రాంతికి ఫిక్స్ చేసుకున్నారు. వీరితో పాటు రవితేజ సినిమాతో పాటు, నాగవంశీ నిర్మాతగా నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న సినిమా కూడా రిలీజ్‌కి రెడీ అయింది. ఇప్పటివరకు ఈ అన్ని సినిమాల నుంచి ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. అయితే, ఇదే సీజన్‌లో నారీ నారీ నడుమ మురారి అనే సినిమా రిలీజ్ చేయడానికి ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ అధినేత అనిల్ సుంకర సిద్ధమయ్యాడు. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని సామజవరగమనా ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేశాడు.

Also Read :Samantha Ex Makeup Artist: ఎన్నైనా తిట్టండి కానీ..సమంత ఫాన్స్’కి మేకప్ ఆర్టిస్ట్ వార్నింగ్

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో సంక్రాంతి సరైన సీజన్ అని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఇదంతా బానే ఉంది కానీ, మూడు పెద్ద హీరోల సినిమాలు, మరొకటి యాక్టివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్న నాగవంశీ నిర్మిస్తున్న సినిమా. దాదాపుగా థియేటర్లు అన్నీ ఈ నాలుగు సినిమాలే పంచుకునే అవకాశం ఉంది. ఈ నేపద్యంలో శర్వానంద్ సినిమాకి థియేటర్లు ఎన్ని దక్కుతాయని చర్చ జరుగుతోంది. దానికి తోడు తమిళం నుంచి రెండు పెద్ద సినిమాలు కూడా పొంగల్ రేసులో ఉన్నాయి. ఆ సినిమాలకు కూడా తెలుగు నిర్మాతలు థియేటర్లు అలొట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ని సినిమాల నేపథ్యంలో అసలు శర్వానంద్ సినిమాకి థియేటర్లు ఎంతవరకు దక్కుతాయని చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. కానీ, శర్వానంద్‌కి శతమానం భవతి, ఎక్స్‌ప్రెస్ రాజా వంటి సినిమాలు సంక్రాంతికి హిట్లుగా నిలిచిన నేపథ్యంలో, నారీ నారీ నడుమ మురారి కూడా అదే సెంటిమెంట్‌తో రిలీజ్ చేయడానికి అనిల్ సుంకర ప్లాన్ చేస్తున్నారు. చూడాలి, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.

Exit mobile version