Site icon NTV Telugu

Sanju Samson: ధోనీ రికార్డుపై కన్నేసిన సంజు.. చరిత్ర సృష్టించేందుకు ఒక్క పరుగు దూరంలో!

Sanju Samson Ms Dhoni

Sanju Samson Ms Dhoni

Sanju Samson: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనున్న 2026 T20 ప్రపంచకప్ ఫైనల్ పోరుకు సర్వం సిద్ధమైంది. భారత్ – న్యూజిలాండ్ మధ్య జరగనున్న ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో అందరి దృష్టి టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ సంజు శాంసన్ పైనే ఉంది. ఈ మ్యాచ్‌లో సంజు కేవలం ఒకే ఒక్క పరుగుతో లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ సరసన చేరబోతున్నాడు. అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Prize Money: ఫైనల్‌లో గెలిచిన జట్టుపై కాసుల వర్షం.. మొత్తం ప్రైజ్ మనీ ఎంతంటే?

ధోనీ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో భారతీయుడిగా..
సంజు శాంసన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉంటూ టీమిండియా విజయాలకు వెన్నెముకలా నిలుస్తున్నాడు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో అతను బ్యాట్‌తో ఒక పరుగు సాధించిన వెంటనే, అంతర్జాతీయ టీ20ల్లో వికెట్ కీపర్‌గా 1,000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో భారత ఆటగాడిగా చరిత్రకెక్కుతాడు. ఇప్పటివరకు టీమిండియా తరపున ఎంఎస్ ధోనీ (1,617 పరుగులు) మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు. సంజు శాంసన్ తన టీ20 కెరీర్‌లో మొత్తం 1,310 పరుగులు చేసినప్పటికీ, అందులో వికెట్ కీపర్‌గా చేసినవి 999 పరుగులు మాత్రమే. మిగిలిన పరుగులు అతను కేవలం బ్యాటర్‌గా ఆడినప్పుడు సాధించినవి. ఇందులో 3 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్లో వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపడుతూ ఒక్క పరుగు తీసినా, ఈ స్పెషల్ లిస్టులో చోటు సంపాదిస్తాడు. ఈ ప్రపంచకప్‌లో సంజు శాంసన్ ఆడిన తీరు అద్భుతం. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనే మొత్తం 232 పరుగులు చేశాడు. గత రెండు మ్యాచ్‌ల్లోనూ వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు. భీకరమైన స్ట్రైక్ రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్న సంజు, ఫైనల్లో కూడా అదే జోరు కొనసాగించి భారత్‌కు ప్రపంచకప్ అందించాలని అభిమానులు ఆశిస్తు్న్నారు.

READ ALSO: Mythri Movie Makers: మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ మామూలుగా లేదుగా.. సల్మాన్ ఖాన్‌తో సినిమా! డైరెక్టర్ ఎవరంటే..

Exit mobile version