Sanju Samson: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. టీ20 వరల్డ్ కప్‌లో సంజూ శాంసన్ సరికొత్త చరిత్ర!

Sanju Samson Message

Sanju Samson Message

Sanju Samson: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా ఆదివారం జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో సంజూ శాంసన్ నయా చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌పై 46 బంతుల్లో 89 పరుగులు చేసిన సంజూ, ఒకే టీ20 వరల్డ్ కప్ ఎడిషన్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. దీంతో గతంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.

READ ALSO: IND vs NZ: 17 ఏళ్ల పాకిస్థాన్ రికార్డు బ్రేక్.. T20 వరల్డ్ కప్ హిస్టరీలో నంబర్ 1 జోడీగా సంజు-అభిషేక్

కోహ్లీ రికార్డు కనుమరుగు..
2014 టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ 319 పరుగులు చేసి రికార్డు సృష్టించగా, తాజా ఇన్నింగ్స్‌తో సంజూ శాంసన్ తన మొత్తం పరుగుల సంఖ్యను 321కి చేర్చి, కోహ్లీ కంటే రెండు పరుగులు అదనంగా సాధించాడు. సంజూ ఈ ఘనతను కేవలం 5 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించడం విశేషం. నిజానికి టోర్నీ ఆరంభంలో సంజూ తుది జట్టులో లేడు. అభిషేక్ శర్మ అనారోగ్యం కారణంగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే అవకాశం పొంది 22 పరుగులు చేశాడు. ఆ తర్వాత అభిషేక్ ఫామ్ కోల్పోవడంతో, ఇషాన్ కిషన్‌ను కిందకు పంపి సంజూను ఓపెనర్‌గా బరిలోకి దింపారు. మేనేజ్మెంట్ ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ జింబాబ్వేపై 24, వెస్టిండీస్‌తో క్వార్టర్ ఫైనల్‌లో 97*, ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్‌లో 89, ఇప్పుడు ఫైనల్‌లో మరో 89 పరుగులతో విరుచుకుపడ్డాడు. ఒక వరల్డ్ కప్ ఎడిషన్‌లో కనీసం 250 పరుగులు చేసిన బ్యాటర్లలో సంజూ శాంసన్ అత్యధిక స్ట్రైక్ రేట్ (199.37) నమోదు చేశాడు. ఇంతటి వేగంతో పరుగులు సాధించడం ప్రపంచ రికార్డుగా నిలిచింది.

రికార్డులు:
ఈ టోర్నీలో పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ (383 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే సంజూ కంటే ఫర్హాన్ ఒక ఇన్నింగ్స్ అదనంగా ఆడాడు. ఇదే మ్యాచ్‌లో టీమిండియా నంబర్ 3 బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా 25 బంతుల్లో 54 పరుగులు చేసి, తన మొత్తం పరుగులను 317కి చేర్చుకున్నాడు. ఈ జాబితాలో ఇషాన్ ఐదో స్థానంలో నిలిచాడు. సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయినా, సంజూ శాంసన్ ఆడిన ఈ మెరుపు ఇన్నింగ్స్ భారత జట్టుకు పటిష్టమైన స్కోరును అందించడమే కాకుండా, కోహ్లీ వంటి దిగ్గజాల రికార్డులను సైతం తుడిచిపెట్టింది.

READ ALSO: India vs New Zealand: అభిషేక్ ఊచకోత.. వరల్డ్ కప్ నాకౌట్‌లో ‘యువీ’ రికార్డు బద్ధలు! పవర్ ప్లేలో ప్రపంచ రికార్డు..