NTV Telugu Site icon

Samantha: భగవద్గీత చదువుతున్న సమంత.. పోస్ట్ వైరల్..

Samantha (3)

Samantha (3)

టాలివుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు ఏడాది బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. సినిమాలకు దూరంగా ఉన్న సామ్ తన మాయోసైటీస్ చికిత్స తీసుకొనుంది.. దీంతో ఇప్పుడు పూర్తిగా తన హెల్త్ పై దృష్టి పెట్టింది. ఇప్పటికే తాను ఒప్పుకున్న సినిమాల నుంచి తప్పుకుంది. అలాగే తీసుకున్న రెమ్యూనరేషన్స్ వెనక్కు ఇచ్చేసింది. అయితే కొద్ది రోజులు సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉన్న సామ్.. ఇప్పుడిప్పుడే ఇన్ స్టా స్టోరీలో మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తుంది.. ఈ క్రమంలో తాజాగా భగవద్గీత చదువుతున్న ఫోటోస్ షేర్ చేసింది. అంతేకాదు.. ఏ భాగాన్ని చదువుతుందో చూపించింది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఇటీవల ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ లో విజయ్ దేవరకొండ హీరోగా నటించారు. ఈ చిత్రంలో సామ్, విజయ్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. అలాగే ఇందులోని సాంగ్స్ సైతం మ్యూజిక్ లవర్స్ ను కట్టిపడేశాయి.ఈ ప్రమోషన్లకు దూరంగా ఉన్న సామ్.. కేవలం సోషల్ మీడియా వేదికగా మాత్రమే మూవీ అప్డేట్స్ పంచుకుంది.. ఈ సినిమా మిక్సీ్డ్ టాక్ ను అందుకుంది.. కానీ విజయ్ దేవరకొండకు మాత్రం భారీ విజయాన్ని అందించింది..

ఇకపోతే సామ్ నటించిన సిటాడెల్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఈ మూవీలో సామ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించినట్లుగా తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటించారు. హాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సిటాడెల్ చిత్రానికి రీమేక్ గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇదిలా ఉండగా.. సామ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతుందని టాక్ వినిపిస్తోంది. సల్మాన్ ఖాన్ జోడిగా సామ్ నటించనుందనే బీటౌన్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు ఈ చిత్రంలో సమంత పేరుతోపాటు.. త్రిష, అనుష్క పేర్లు కూడా వినిపిస్తున్నాయి..

Show comments