టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం.. హిట్ మూవీ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన సైంధవ్ మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మాతగా వ్యవహారిస్తున్నారు.. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. వెంకీ పవర్ ఫుల్ యాక్టింగ్, శైలేష్ కొలను దర్శకత్వం, యాక్షన్, ఎమోషనల్ అంశాలకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. వెంకీ 75 వ చిత్రంగా తెరకేక్కిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది..
ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, బాలీవుడ్ నటుడు నవాజుద్ధీన్ సిద్దిఖీ కీలకపాత్రలు పోషించగా.. నిహారికా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మించారు. ఈ చిత్రానికి రోజు రోజుకీ మరింత డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది సైంధవ్. సంక్రాంతి కానుకగా విడుదలైన అన్ని చిత్రాలు సూపర్ హిట్ అందుకున్నాయి.. ఇక అమెరికాలో రెస్పాన్స్ మాములుగా లేదు.. ఎన్నారై సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంది..
ఇకపోతే అమెరికాలో కలెక్షన్స్ ను కూడా భారీగా రాబట్టినట్లు తెలుస్తుంది..యూఎస్ఏలో 200కె డాలర్స్ కి పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక భారతదేశంలో మొదటి రోజు రూ.3.8 కోట్లు రాబట్టిన ఈ రెండో రోజు రూ.2.85 కోట్లు.. మూడవ రోజు రూ.3.35 కోట్లు రాబట్టింది. అటు అమెరికాలోనూ వెంకీమామ క్రేజ్ కొనసాగుతుంది. కూతురి ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఒక తండ్రి పడే ఆరాటం.. వెన్నెమూక కండరాల సమస్యతో బాధపడుతున్న ఆ చిన్నారిని రక్షించుకోవడానికి.. రూ.17 కోట్లు విలువైన ఇంజక్షన్ ను వెంకీ ఎలా సంపాదించాడు అనేది సినిమా కథ.. క్లైమాక్స్ బాగా వర్కౌట్ అయింది… యాక్షన్స్ తో వన్ మ్యాన్ షో అయ్యింది.. ఇదే సినిమాకు హైలెట్ అయ్యింది.. మొత్తానికి వెంకీ మామ ఖాతాలో హిట్ పడినట్లు తెలుస్తుంది. మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..
