NTV Telugu Site icon

SAIL Recruitment 2024: ఇంజినీరింగ్ అర్హతతో లక్షల్లో జీతం.. వివరాలు ఇలా..

Sail

Sail

SAIL Recruitment 2024 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL)లో ఉద్యోగం పొందడానికి మంచి అవకాశం లభించనుంది. ఇటీవలే కంపెనీ వివిధ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆ తర్వాత అధికారిక వెబ్‌సైట్ sailcareers.com లో ఆన్‌లైన్ దరఖాస్తులు కూడా ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు SAIL ఈ రిక్రూట్‌మెంట్ కోసం చివరి తేదీ 25 జూలై 2024 వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుమును సమర్పించడానికి ఇదే చివరి తేదీ కూడా.

Kiran Abbavaram: ఆ సినిమా రైట్స్ కోసం పోటీ.. ఎవరికి దక్కేనో..?

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా.. మెకానికల్ ఇంజనీరింగ్ (ME ), కంప్యూటర్ ఇంజనీరింగ్ (CS ), సివిల్ ఇంజనీరింగ్ (EE ) ఇంకా అనేక ఇతర ట్రేడ్‌లలో అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులు. ఏయే ట్రేడ్‌లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చూస్తే..

* కెమికల్ ఇంజినీరింగ్​ – 10 పోస్టులు.
* సివిల్ ఇంజినీరింగ్ – 21 పోస్టులు.
* కంప్యూటర్ ఇంజినీరింగ్ – 9 పోస్టులు.
* ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్​ – 61 పోస్టులు.
* ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ – 5 పోస్టులు.
* ఇన్​స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్​​ – 11 పోస్టులు.
* మెకానికల్ ఇంజినీరింగ్ – 69 పోస్టులు.
* మెటలర్జీ ఇంజినీరింగ్ – 63 పోస్టులు.

ఇలా మొత్తంగా 249 పోస్టులు భర్తీ కానున్నాయి. ఒక సంవత్సరం శిక్షణ సమయంలో 50000-1,60000/- పే స్కేల్ ఉంటుంది. శిక్షణ తర్వాత, అసిస్టెంట్ మేనేజర్‌గా పోస్టింగ్ చేయబడుతుంది. ఆ సమయంలో నెలకు జీతం రూ. 60000 -1,80000/- ఉండనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత ట్రేడ్‌లో B.E./ B.Tech ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి. ఇది కాకుండా గేట్ 2024 స్కోర్ కార్డ్ కూడా కలిగి ఉండటం అవసరం. ఇక అభ్యర్థుల కనీస వయస్సు 25 జూలై 2024 నాటికి 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 28 సంవత్సరాలు మధ్య ఉండాలి. రిజర్వ్డ్ వర్గాలకు కూడా గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడింది.

Sri vishnu : శ్రీ విష్ణుది చూసి ఆశ్చర్యపోతున్న సినీ వర్గాలు…ఇంతకీ ఏమిటది…?

సెయిల్ కి దరఖాస్తు చేస్తున్నప్పుడు.. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ. 700 దరఖాస్తు రుసుము చెల్లించాలి. అయితే SC/ST కేటగిరీ అభ్యర్థులకు ఈ రుసుము రూ. 200గా నిర్ణయించబడింది. ఈ రిక్రూట్మెంట్‌ లో అభ్యర్థులను గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. గేట్ 2024 మార్కులు లేదా స్కోర్ సంఖ్య ఆధారంగా అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ అవుతారు.